Do not Conduct ‘Maa’ elections: Junior Artist Association: మూవీ ఆర్టిస్ట్ అసోసిలు రేపు జరగనున్న నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘మా’ బోగస్ ఓటర్లు ఉన్నారని, అవి తొలగించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజే.. రేపు ‘మా’ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయని, ఫలితాలు సోమవారం ( 11వ తేదీన ) విడుదల చేస్తామని ‘మా’ ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. ఒకవైపు అధ్యక్షబరిలో నిలిచిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారా అనే విషయంపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు బోగస్ ఓటర్ల సమస్య ఎదురైంది.
ఉన్నట్టుండి జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు ‘మా’ ఓటరు జాబితాలో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరిగే మా ఎన్నికల పోలింగ్ లో మూడువేల ఐదు వందలకు పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే అవకాశం ఉందని.. కానీ అందులో చాలా మంది యూనియన్ సభ్యులు కాని వారు ఉన్నారని సంఘం తెలిపింది. దీనిని పరిగణలోకి తీసుకోవాలని సంఘ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో సినీ పరిశ్రమకు సంబంధంలేని వారి నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన సమావేశంలో కూడా అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగతాయని తమ సంఘానికి చెప్పలేదని, ఇలా చెప్పకుండానే ఎలా ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తున్నారని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ సభ్యులు తమ గత రికార్డుల గురించే ఊసే ఎత్తడం లేదని, అడిగిన ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ‘మా’ లో ప్రతి అంశంపై జూనియర్ ఆర్టిస్టులు కూడా విచారణ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని, వారి సమస్యలు పరిశీలించిన తరువాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించుకోవాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు.