Samantha On Vijay Devarakonda: సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఆమె మయోసైటిస్ కి చికిత్స కోసం వెళ్లడం జరిగింది. సమంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె ముందుగానే ఖుషి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంది. హైదరాబాద్ వేదిక మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇది భారీగా సక్సెస్ అయ్యింది. ఈ వేదికపై విజయ్ దేవరకొండతో ఆమె ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ హైలెట్ అయ్యింది. చొక్కా విప్పేసిన విజయ్ దేవరకొండ సమంతను పైకి ఎత్తుకున్నాడు. చిత్ర ప్రమోషన్ కోసం వీరిద్దరూ కొంచెం హద్దులు దాటారనిపించింది.
ఖుషి పలు భాషల్లో విడుదలవుతుండగా తమిళ మీడియాతో విజయ్ దేవరకొండ, సమంత ముచ్చటించారు. అక్కడ కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత విజయ్ దేవరకొండను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ ఆశ్చర్యపోయాడు. సమంత మాట్లాడుతూ… విజయ్ దేవరకొండను అందరూ రౌడీ హీరో అంటారు. దాంతో అతడు బాగా రెబల్, యాటిట్యూడ్ కలిగి ఉంటాడని, చెడు అలవాట్లు ఉంటాయని నేను భావించాను.
కానీ విజయ్ దేవరకొండకు ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. అతడు ప్రతిరోజూ వ్యాయామం చేస్తాడు. క్రమశిక్షణగా ఉంటాడు. వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉంటాడు. ఇవన్నీ తెలిశాక నా అభిప్రాయం మారిపోయింది. షాక్ అయ్యాను… అని అన్నారు. చెప్పాలంటే విజయ్ దేవరకొండకు సమంత మిస్టర్ పర్ఫెక్ట్ అనే కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది. సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఖుషి విషయానికి వస్తే సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రెండోసారి విజయ్ తో సమంత జతకట్టింది. గతంలో వీరు మహానటి మూవీలో జంటగా నటించారు. ఖుషి చిత్ర పాటలు, ప్రోమోలు ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఖుషితో ఆయన హిట్ దాహం తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
"You'll be Surprised to know that #VijayDeverakonda doesn't have any bad Habits, Even I was surprised when I came to know this" – #Samantha pic.twitter.com/FmPlRfD1Xa
— Daily Culture (@DailyCultureYT) August 25, 2023