https://oktelugu.com/

Samantha: మరోసారి విలన్ పాత్రలో కనిపించబోతున్న సమంత..షాక్ లో ఫాన్స్

Samantha: సౌత్ ఇండియా లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న హీరోయిన్ సమంత..ప్రతి ఏడాది ఎంత మంది కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్న కూడా సమంత డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనే చెప్పాలి..ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకి టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2022 / 08:34 AM IST
    Follow us on

    Samantha: సౌత్ ఇండియా లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న హీరోయిన్ సమంత..ప్రతి ఏడాది ఎంత మంది కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్న కూడా సమంత డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనే చెప్పాలి..ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకి టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ తో పాటుగా హాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..నిన్ను కోరి , మజిలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు..వీటితో పాటుగా ఆమె యశోద మరియు శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది..కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఈమె లేడీ విలన్ రోల్స్ కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది..దర్శకులకు ఇప్పుడు లేడీ విలన్ రోల్ ని డిజైన్ చెయ్యాలంటే వారిలో మైండ్ లో అందరికంటే ముందు సమంత పేరే స్ట్రైక్ అవుతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఎందుకంటే గత ఏడాది ఫామిలీ మ్యాన్ 2 లో ఆమె పోషించిన నెగటివ్ రోల్ కి వచ్చిన రెస్పాన్స్ అలాంటిది మరి.

    ఈ సినిమాకి ముందు కూడా ఆమె తమిళం లో విక్రమ్ తో కలిసి చేసిన 10 ఎండ్రకుల్లా మరియు సూపర్ డీలక్స్ వంటి సినిమాలలో నెగటివ్ రోల్స్ చేసింది..ఇలా అత్యధిక నెగటివ్ రోల్స్ చేసిన ఈ తరం స్టార్ హీరోయిన్ గా సమంత అరుదైన రికార్డు ని సొంతం చేసుకుంది..ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే..విక్రమ్, మాస్టర్ మరియు ఖైదీ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సౌత్ ఇండియా లో క్రేజీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయిన లోకేష్ కనకరాజ్ తన తదుపరి చిత్రం ఇళయ తలపతి విజయ్ తో చెయ్యబోతున్న విషయం మన అందరికి తెలిసిందే.

    Also Read: Rakul Preet Singh: ఆ హీరో కోసం కెరీర్ ని చేతులారా నాశనం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

    Samantha

    ఈ సినిమాలో సమంత విలన్ రోల్ చెయ్యబోతున్నట్టు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..హీరో విజయ్ తో తలపడే పవర్ ఫుల్ క్యారక్టర్ ని సమంత కోసం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది..గతం లో విజయ్ – సమంత కాంబినేషన్ లో కత్తి మరియు తేరి వంటి సినిమాలు వచ్చాయి..ఈ రెండు కూడా వీళ్లిద్దరి కెరీర్ లో భారీ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా ఇదే..విజయ్ తో చేసిన రెండు సినిమాలలో సమంత హీరోయిన్ గా నటించగా ఇప్పుడు మూడవ సినిమా లో నెగటివ్ రోల్ చెయ్యడం విశేషం..ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.

    Also Read:CPI Narayana : చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఎందుకు అక్కసు?

    Tags