https://oktelugu.com/

Dil Raju- Ram Pothineni: అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన సినిమా హీరో రామ్ తో చెయ్యబోతున్న దిల్ రాజు

Dil Raju- Ram Pothineni: మన టాలీవుడ్ లో ఒక హీరో చెయ్యాల్సిన మూవీ మరో హీరో చేతికి పోవడం..అవి భారీ హిట్ లేదా భారీ ఫ్లాప్ అవవడం ఇది వరుకు ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చూసాము.. అలాగే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెయ్యాల్సిన ఒక సినిమా ఎనెర్జిటిక్ స్టార్ రామ్ చేతికి వెళ్లినట్టు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ – వేణు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2022 / 08:42 AM IST
    Follow us on

    Dil Raju- Ram Pothineni: మన టాలీవుడ్ లో ఒక హీరో చెయ్యాల్సిన మూవీ మరో హీరో చేతికి పోవడం..అవి భారీ హిట్ లేదా భారీ ఫ్లాప్ అవవడం ఇది వరుకు ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చూసాము.. అలాగే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెయ్యాల్సిన ఒక సినిమా ఎనెర్జిటిక్ స్టార్ రామ్ చేతికి వెళ్లినట్టు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ – వేణు శ్రీ రామ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ‘ఐకాన్- కనుపడుట లేదు’ అనే సినిమా ప్రకటించి చాలా కాలం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది..MCA వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి సెన్సషనల్ హిట్ ని తీసాడు..ఈ సినిమా ద్వారా ఆయన మీడియం రేంజ్ హీరోలని కాదు..స్టార్ హీరోలను కూడా గొప్పగా చూపించగలను అని నిరూపించుకున్నాడు..ఇక నుండి ఈయనకి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు వస్తాయని అందరూ అనుకున్నారు..కానీ ఇతనితో సినిమా చెయ్యడానికి అప్పట్లో ఒప్పుకున్నా అల్లు అర్జున్ ఇప్పుడు తప్పుకున్నట్టు తెలుస్తుంది.

    Dil Raju- Ram Pothineni

    పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే..అంచనాలను మించి పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో పుష్ప 2 స్క్రిప్ట్ ని అంచనాలను అందుకునే విధంగా తీర్చి దిద్డేందుకు డైరెక్టర్ సుకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు..అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కి మొత్తం పాన్ ఇండియా స్కేల్ ఉన్న సినిమాలు తీసే డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు..కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయ్యి ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.

    Also Read: Samantha: మరోసారి విలన్ పాత్రలో కనిపించబోతున్న సమంత..షాక్ లో ఫాన్స్

    Dil Raju

    ఈ నేపథ్యం ఐకాన్ సినిమాని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది..దీనితో ఇప్పుడు ఈ చిత్రాన్ని హీరో రామ్ తో తియ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు..త్వరలోనే వేణు శ్రీరామ్ తో కలిసి రామ్ వద్దకి స్టోరీ న్యారేషన్ కోసం దిల్ రాజు వెళ్ళబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగాయి..త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంబించుకోబోతుంది..ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలయ్యే ఛాన్స్ ఉంది..మరి ఐకాన్ కి రామ్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి.

    Also Read:Rakul Preet Singh: ఆ హీరో కోసం కెరీర్ ని చేతులారా నాశనం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

    Tags