https://oktelugu.com/

Rakul Preet Singh: ఆ హీరో కోసం కెరీర్ ని చేతులారా నాశనం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్..కెరటం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో భారీ హిట్ కొట్టింది..ఈ సినిమా ద్వారానే ఆమె కెరీర్ లో లైం లైట్ లోకి వచ్చింది..ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఒక్క పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2022 / 08:28 AM IST
    Follow us on

    Rakul Preet Singh: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్..కెరటం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో భారీ హిట్ కొట్టింది..ఈ సినిమా ద్వారానే ఆమె కెరీర్ లో లైం లైట్ లోకి వచ్చింది..ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఒక్క పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ తో మినహా మిగిలిన స్టార్ హీరోలందరితో ఈమె నటించింది..కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్న సమయం లో ఈమెకి వరుస ఫ్లాప్స్ స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి..తెలుగు మరియు తమిళ బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు చిన్న హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడం లేదు..ఆమె తెలుగు లో ఆఖరుగా నటించిన సినిమా కొండపొలం..ప్రముఖ దర్శకుడు క్రిష్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్ అయ్యింది..దీనితో ప్రస్తుతం ఈమెతో టాలీవుడ్ లో పని చెయ్యడానికి ఏ దర్శక నిర్మాత కూడా ఆసక్తి చూపించడం లేదు.

    Rakul Preet Singh

    ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలన్నీ హిందీ సినిమాలే..ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ అనే చెప్పుకోవచ్చు..ఇక కోలీవుడ్ లో ఈమె అక్కడి క్రేజీ హీరో శివ కార్తికేయన్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా చేస్తుంది..ఇవి తప్ప ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేదు..ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు సూపర్ హిట్ అయితే ఆమెకి మళ్ళీ స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది..ఇవన్నీ పక్కన పెడితే ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా ఆగిపోవడానికి కారణం అక్కినేని నాగార్జున అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త..ఆమె అక్కినేని నాగార్జున తో కలిసి మన్మధుడు 2 అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది..రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

    Also Read: CPI Narayana : చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఎందుకు అక్కసు?

    Rakul Preet Singh

    డిజాస్టర్ ఫ్లాప్స్ రకుల్ ప్రీత్ కి కొత్తేమి కాదు..కానీ ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర తీవ్రమైన విమర్శల పాలయ్యేలా చేసింది..అందుకే ఆమెకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి అని అంటుంటారు..ఒకానొక్క దశలో మహేష్ బాబు , రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా డేట్స్ సర్దుబాటు చెయ్యలేనంత బిజీ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వకపోవడం గమనార్హం..మరి రాబొయ్యే సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్స్ కొట్టి కెరీర్ లో పూర్వ వైభవం ని రప్పించుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read:
    Nabha Natesh: స్టార్ హీరో సినిమాలో ‘నభా నటేష్’.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ !

    Tags