Samantha: స్టెరాయిడ్స్ వాడుతున్న సమంత… అందం మీద తీవ్ర ప్రభావం!

నిజానికి ఖుషి సినిమా కంటే ముందు సమంత మయోసైటిస్ తో బాధపడుతూ చికిత్స తీసుకున్న కానీ పూర్తిగా నయం కాలేదు. దీనితో సినిమా పూర్తి కాగానే తన తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్ళింది.

Written By: Shiva, Updated On : September 21, 2023 1:50 pm

Samantha

Follow us on

Samantha: తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత రీసెంట్ గా ఖుషి సినిమాతో మంచి సక్సెస్ సాధించింది. తన కంటే ఏజ్ లో చిన్నవాడైన విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసిన సమంత మంచి జోడిగా ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా రిలీజ్ టైం లో మ్యూజిక్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంది. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్ లో పాల్గొనలేదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది.

నిజానికి ఖుషి సినిమా కంటే ముందు సమంత మయోసైటిస్ తో బాధపడుతూ చికిత్స తీసుకున్న కానీ పూర్తిగా నయం కాలేదు. దీనితో సినిమా పూర్తి కాగానే తన తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్ళింది. రీసెంట్ గా టూర్ ముగించుకొని ఇటీవల ఇండియా వచ్చింది. సమంత తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ వీడియో సెషన్ నిర్వహించింది. వాటిలో ఆమె ముఖం గమనిస్తే చాలా తేడా కనిపిస్తుంది.

సమంత ముఖం గమనిస్తే ఫేస్ లో ఆమె స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్ధం అవుతుంది. దీనితో ఒక అభిమాని మాట్లాడుతూ మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. దీనితో సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది. వాటి ప్రభావం కారణంగా నా స్కిన్ ఇలా తయారు అయ్యింది, అయితే మరి ఇంతలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నా స్కిన్ ప్రాబ్లెమ్ పరిష్కరించే బాధ్యత చిన్మయి తీసుకుంది. అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఖుషి సినిమా తర్వాత ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు. బహుశా మయోసైటిస్ వ్యాధి నుండి ఆమె బయటకు రావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది కూడా సమంత నుంచి సినిమా రావడం కష్టమే. అయితే ఈ సారి బాలీవుడ్ మీద ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది.