Samantha Ruth Prabhu : సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిల్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతోంది. బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో 15 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోయాయి. సినిమా విడుదలైన 3 వారాల తర్వాత కూడా ఈ రేంజ్ ట్రెండ్ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే సమంత ఈ చిత్రం తో సౌత్ ఇండియా లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ సాధించలేని అరుదైన రికార్డు ని నెలకొల్పింది.
‘మా ఇంటి బంగారం’ చిత్రం నేటితో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది. ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు సౌత్ లో ఏ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా నమోదు అవ్వలేదు. సమంత తోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్యాటగిరీ లో ఈ క్లబ్ ఖాతాని తెరుచుకుంది. దీంతో సమంత తన మూవీ టీం తో కలిసి సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో సమంత బేబీ బంప్ తో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సమంత నే రీసెంట్ గా చెప్పుకొచ్చింది. మెటర్నిటీ లీవ్ కారణం గా కొన్నాళ్ళు సినిమాలకు కూడా దూరం అవుతున్నట్టు చెప్పుకొచ్చింది సమంత.
ఈ వీడియో ని సమంత ముఖం లోని ఆనందాన్ని చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆమెని ఈ రేంజ్ సంతోషంగా చూసి ఎన్నాళ్ళు అయ్యిందో , నాగ చైతన్య తో విడాకులు జరిగిన తర్వాత సమంత కెరీర్ అయిపోయింది , వ్యక్తిగతంగా , శారీరకంగా ఆమె కోలుకోవడం సాధ్యం అవ్వదేమో అని ఆమె అభిమానులు కూడా బాధపడ్డారు. కానీ తనకు ఎదురైనా సవాళ్ళను ధైర్యంగా ఛేదించి , నేడు ఆమె సాధించిన ఈ విజయం కచ్చితంగా నేటి తరం మహిళలకు ఆదర్శప్రాయం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందో చూడాలి.
