Tollywood Actresses Plastic Surgery: ఈ మధ్య హీరోయిన్లు తమ ముఖాలకు ట్రీట్మెంట్ లు చేయించుకోవడం చాలా సహజం అయిపోయింది. తప్పదు మరీ.. ప్రతి హీరోయిన్ స్క్రీన్ పై జిగేల్‌మనే అందాలతో, మేకప్ ఫ్లాష్ ల గుమగుమలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. పైగా తమ సొగుసుల ఒయ్యారాల దెబ్బకు ప్రేక్షకులు మైమరచిపోవాలి. తమ కోసం కొట్టే కరతాళ ధ్వనులు మిన్నంటాలి. ఇలాంటి కోరికలు ప్రతి హీరోయిన్ కి ఉంటాయి. అసలుకే గ్లామర్ లోకం. ఆ తళుకుబెళుకులను పక్కనపెడితే.. ఇక ఛాన్స్ లు కూడా రావు. అందుకే.. కష్టమో నష్టమో.. తప్పో ఒప్పో.. మొత్తానికి సర్జరీ ల వైపు హీరోయిన్లు ముచ్చట పడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. సమంత కూడా తన ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీని ప్లాన్ చేసుకుందట. తన ముఖం మరీ లేతగా కనిపించాలానే ఉద్దేశ్యంతోనే సమంత ఈ సర్జరీ చేయించుకుంటుందట. చాలా యంగ్ గా కనిపించాలనే కోరిక సామ్ కి ఎప్పటి నుంచో ఉందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. సమంత వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఇంకా 25 ఏళ్ల అమ్మాయిగానే కనిపించాలని సమంత కోరుకుంటుంది. అందుకే వరుసబెట్టి ప్లాస్టిక్ సర్జరీలు ప్లాన్ చేసుకుందట.. దీనికి అసలు కారణం.. చైతన్యతో విడాకులు కావడం.. అవకాశాలు తగ్గిపోవడంతో అవకాశాల కోసం ఈ సర్జరీలు చేయించుకుంటోందన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
గ్లామర్ కోసం హీరోయిన్లు ఇలా తప్పక సర్జరీలు చేయించుకోవాలి. అతిలోక సుందరి శ్రీదేవీ నుంచి సమంత వరకు.. అనేక సర్జరీలు చేయించుకొని సినిమా అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ పెద్దదే ఉంది. ఇంతకీ ఏ హీరోయిన్ సర్జరీ చేయించుకుంది ? మరి ఆ సర్జరీలకు ఏ హీరోయిన్ ఎంత ఖర్చు చేసిందో చూద్దాం రండి.
-సమంత కెరీర్ స్టార్టింగ్ లో చాలా సింపుల్ గా పక్కింటి అమ్మాయిలా ఉండేది. కానీ, స్టార్ డమ్ వచ్చాక, ముంబై భామలకు పోటీ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో సర్జరీ చేయించుకుంది. సామ్ తన సర్జరీ కోసం 2 కోట్ల దాక ఖర్చు పెట్టింది.

-శ్రీదేవి అనగానే దేవకన్య అని, సినిమా కోసమే దేవుడు పుట్టించిన అతిలోక సుందరి అని అంటుంటారు. మరి ఈ అందాల దేవత తన ముక్కు సర్జరీ కోసం ఆ రోజుల్లోనే ఏకంగా కోటి దాక ఖర్చు పెట్టింది.
-శ్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఇప్పటికే సర్జరీలు చేయించుకోవడంలో ఆరితేరి పోయింది. తన లిప్ సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టింది.
– ఆసిన్ కూడా తన లిప్ సర్జరీ కోసం కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టింది.
– సీనియర్ బ్యూటీ త్రిష కూడా తన ముక్కు సర్జరీ కోసం 3 కోట్ల దాక ఖర్చు పెట్టింది.
-పాపం అనుష్క కూడా లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుంది. కానీ ఈ విషయంపై స్వీటీ ఎప్పుడు స్పందించలేదు. తన సర్జరీ కోసం కోటి దాక ఖర్చు పెట్టింది.
– లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా చాలా సర్జరీలు చేయించుకుంది. లైఫో సక్షన్ + ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ కోసం దాదాపు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టింది.
– క్రేజీ భామ తాప్సీ కూడా తన నోస్ సర్జరీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టింది.
– అందాల చందమామ కూడా తన నోస్ సర్జరీ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టింది.
– కార్తీక కూడా తన సర్జరీ కోసం కోటి ఖర్చు పెట్టింది.
మొత్తానికి అందమైన హీరోయిన్ల అందాల వెనుక ఇన్ని సర్జరీలు ఉంటాయన్న మాట..తాజాగా సమంత కూడా ఆ బాటపట్టడం చూస్తుంటే అదే అనిపిస్తోంది.