Samantha : పెళ్లి తర్వాత ఈమధ్య కొన్ని జంటలు విడిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, అదే విధంగా రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్న జంటలు కూడా విడాకులు తీసుకోవడం ఈమధ్య కాలంలో చాలానే చూశాం. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య భరణం డిమాండ్ చేయడం సర్వసాధారణం. ఒక్కొక్కరు విడాకులు తర్వాత వంద కోట్ల రూపాయలకు పైగా భరణం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు హృతిక్ రోషన్(Hrithik Roshan) తన భార్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు 380 కోట్ల రూపాయిల భరణం ఇచ్చాడు. ఇది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఏ అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా ఆశించలేదు. ఆమె మరెవరో కాదు సమంత(Samantha Ruth Prabhu). 2021 వ సంవత్సరం లో ఈమెకు నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు జరిగింది.
Also Read : సమంత మొబైల్ లో ‘మై లవ్’ పేరుతో కాంటాక్ట్ నెంబర్..అది ఎవరిదంటే!
విడాకులు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం 200 కోట్ల రూపాయిల భరణం అక్కినేని కుటుంబం సమంతకు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నారట, కానీ సమంత ఒక్క పైసా కూడా తీసుకోలేదట. సమంత సన్నిహితులు కనీసం 50 కోట్ల రూపాయిలు అయినా తీసుకోమని ఆమెకు సలహాలు ఇచ్చారు. కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు. నాకు ఎవరి డబ్బులు అవసరం లేదని, తన సొంత కాళ్ళ మీద నిలబడే సత్తా ఉందని ఆమె తన సన్నిహితులతో చెప్పిందట. విడాకులు తర్వాత సమంత శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురైందో మన అందరికీ తెలిసిందే. చావు బ్రతుకులతో పోరాడి బయటకు వచ్చింది. డబ్బులు బాగా ఖర్చు అయిపోయాయి. ఆరోగ్య బాగాలేకపోవడం వల్ల సమంత సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించేసింది. అలాంటి సమయంలో ఆమెకు అక్కినేని కుటుంబం ఇచ్చే భరణం తీసుకొని ఉండుంటే ఎంతో ఉపయోగపడేవి. కానీ ఆమె అలాంటివి ఆశించలేదు.
ఒంటరిగా నిల్చి పోరాడింది, కేవలం ఆమె నిలబడడమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి కొత్తవాళ్లను ఇండస్ట్రీ కి తీసుకొచ్చి, వాళ్ళను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మహిళా దేశంలో ఎంతమంది ఉంటారు మీరే చెప్పండి. ఈమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మగవాళ్లకు అయినా, ఆడవాళ్లకు అయినా ఉంది. అందుకే సమంత ని అందరూ అంతలా గౌరవిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే పూర్తిగా అనారోగ్యం కోలుకున్న సమంత మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ కానుంది. ఇప్పటికే ఈమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తునం ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి రెండు కాకుండా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.
Also Read : ఒక్క సినిమా కూడా చేతిలో లేదు అంటూ హీరోయిన్ సమంత కన్నీళ్లు!