https://oktelugu.com/

Lamborghini : ఈ కారు కావాలంటే ఇప్పుడు బుక్ చేస్తే మూడేళ్లకు వస్తుంది

Lamborghini : లగ్జరీ సూపర్‌కార్ బ్రాండ్ లంబోర్ఘిని కార్లకు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. లంబోర్ఘిని ఉరుస్ మోడల్ చాలా ప్రజాదరణ పొందింది. హురాకాన్, ఉరుస్, రెవుల్టో మోడళ్లకు కూడా భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది.

Written By: , Updated On : March 23, 2025 / 08:48 PM IST
Lamborghini

Lamborghini

Follow us on

Lamborghini : భారత్‌లో లగ్జరీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒకప్పుడు పేద దేశంగా పిలువబడిన భారతదేశంలో ఇప్పుడు లగ్జరీ కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మెర్సిడెస్-బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, జాగ్వార్-ల్యాండ్ రోవర్, పోర్స్చే వంటి లగ్జరీ కార్లకే కాకుండా లగ్జరీ సూపర్‌కార్ల డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది.

లంబోర్ఘిని కార్లకు డిమాండ్
లగ్జరీ సూపర్‌కార్ బ్రాండ్ లంబోర్ఘిని కార్లకు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. లంబోర్ఘిని ఉరుస్ మోడల్ చాలా ప్రజాదరణ పొందింది. హురాకాన్, ఉరుస్, రెవుల్టో మోడళ్లకు కూడా భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఈ కార్ల ధరలు రూ. 4 కోట్ల నుండి రూ. 8.89 కోట్ల వరకు ఉన్నాయి. ఈ కార్లపై 100 శాతం కంటే ఎక్కువ పన్ను విధిస్తారు. అయినప్పటికీ, 2027 వరకు ఈ కార్లు భారతదేశంలో బుక్ అయ్యాయి. దీంతో కంపెనీ ఇప్పుడు కొత్త కార్ల ఆర్డర్‌లను స్వీకరించే స్థితిలో లేదు.

Also Read : మార్కెట్లోకి రూ.9కోట్ల కారు.. కాకపోతే దీనిని కొంతమందే కొనగలరు

లంబోర్ఘిని అమ్మకాలు
భారతీయ మార్కెట్‌లో లంబోర్ఘిని అమ్మకాల గురించి కంపెనీ ఛైర్మన్, సిఇఒ స్టీఫెన్ వింకెల్‌మన్ మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు తమకు పెద్ద మార్కెట్ గా మారిందని అన్నారు. భారతదేశంలో లంబోర్ఘిని సగటు కొనుగోలుదారు 40 ఏళ్లలోపు వారే. 2024లో కంపెనీ రికార్డు స్థాయిలో 113 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. ఈ మొత్తం అమ్మకాల్లో లంబోర్ఘిని ఉరుస్ అమ్మకాలు 50 శాతం వరకు ఉన్నాయి.

ఇతర లగ్జరీ కార్ల అమ్మకాలు
లంబోర్ఘిని మాదిరిగానే, 2024లో మెర్సిడెస్-మేబ్యాక్ అమ్మకాలు కూడా 145 శాతం పెరిగాయి. కంపెనీ మెర్సిడెస్-మేబ్యాక్ 500 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన మేర్సిడెస్ బెంజ్ మేబాచ్ sl 680 మోనోగ్రామ్ సిరీస్ కార్లు 4.2 కోట్ల ఎక్స్ షోరూమ్ ధర పలుకుతుంది. ఇలాంటి లగ్జరీ కార్లు భారతదేశంలో కేవలం ముగ్గురికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ లగ్జరీ కారు డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో మొదలవుతాయి. భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.

Also Read: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ.. ఏకంగా ఎన్ని లక్షలు పెంచిందంటే ?