Samantha : పాన్ ఇండియా లెవెల్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ‘ఏ మాయ చేశావే’ అనే సినిమాతో మొదలైన ఆమె కెరీర్, ఇప్పుడు ఏ రేంజ్ కి వెళ్లిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా ఆమెకు చెన్నై లో బిహైండ్ వుడ్స్ అవార్డుల(Behindwoods Awards) వేడుకలో 2010 వ సంవత్సరం నుండి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాత్రలు పోషిస్తూ ఈ రేంజ్ కి వచ్చినందుకు గాను కె బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత తన తమిళ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : నాగ చైతన్య టాటూ ని తొలగించడానికి సమంత అంత పని చేసిందా..?
ఆమె మాట్లాడుతూ ‘నేటితో నా జీవితం పరిపూర్ణమైనది గా భావిస్తున్నాను. కె బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు నాకు దక్కడం నేను చేసుకున్న అదృష్టం. బాలచందర్ గారంటే నాకు ఎంతో అభిమానం. ఆయన సినిమాల్లోని స్త్రీ పాత్రలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళ పాత్రల్లో సహజత్వం ఉట్టిపడేది. అలాంటి మహనీయుడి అవార్డుని అందుకోవడం నాకు దక్కిన అరుదైన గౌరవం గా భావిస్తున్నాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదములు. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే మనల్ని ప్రేమించే వారు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటారు. కానీ నేను తమిళం లో ఒక సినిమా చేసి చాలా రోజులైంది. ప్రస్తుతం నా చేతిలో ఒక్క తమిళ సినిమా కూడా లేదు. నా గత తమిళ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. అయినప్పటికీ నా పై తమిళ ప్రజలు ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఇది నేను జీవితాంతం మర్చిపోలేను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరే. మీరు లేకపోతే నేను లేను’ అంటూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది.
సమంత తమిళనాడుకు చెందిన అమ్మాయే. కానీ తెలుగు లోనే ఈమెకు అత్యధిక సూపర్ హిట్స్ ఉన్నాయి. తమిళ ఆడియన్స్ కంటే ఈమెను తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతారు. కానీ అటు తమిళం లో కానీ, ఇటు తెలుగు లో కానీ సమంత కి ఉన్నంత క్రేజ్ మిగిలిన హీరోయిన్స్ కి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఇలాంటి రేంజ్ త్రిష కి ఉండేది, ఇప్పుడు ఆమె స్థానం లో సమంత ఉంది. ఇకపోతే సమంత గత ఏడాది ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.
Also Read : మళ్లీ హాస్పిటల్ బెడ్ కి పరిమితమైన సమంత.. ఆందోళనలో అభిమానులు..ఈసారి ఏమైందంటే!