Rashmika Mandanna
Rashmika Mandanna : టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్ల కెరీర్లు దాదాపుగా ముగిసిపోయినట్టే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ ని ఏలారు. అలాంటి వారిలో ఒకప్పుడు శ్రీదేవి అయితే, నేటి తరం హీరోయిన్స్ లో రష్మిక(Rashmika Mandanna) అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘పుష్ప’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో రష్మిక పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ఆమె ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ గా మారింది. రష్మిక లోని యాక్టింగ్ టాలెంట్ ని చూసిన డైరెక్టర్ సందీప్ వంగ , ఆమెకు ‘యానిమల్’ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
Also Read : నాగ చైతన్య నుండి 200 కోట్ల ఆఫర్..రిజెక్ట్ చేసిన సమంత!
ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎదో హీరో పక్కన డ్యాన్స్ వేసి వెళ్లే హీరోయిన్ రోల్ కాదు. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. ఫలితంగా ఆమె బాలీవుడ్ ఆడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘పుష్ప 2’ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా వైడ్ గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘చావా’ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాదు, రష్మికకు నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి ఈ సినిమాలు. ఇకపోతే రీసెంట్ గా ఆమె సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి ‘సికిందర్'(Sikindar Movie) అనే చిత్రం చేసింది.
ఈ నెల 30 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ముంబై కి వెళ్లిన రష్మికకు ఒక వింత అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు తీయడానికి వచ్చిన ఒక ఫోటో గ్రాఫర్ రష్మిక తో ముచ్చట్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆయన సికందర్ చిత్రం లోని పాటకు డ్యాన్స్ వేసి రష్మిక ని మెప్పించాడు. అతని డ్యాన్స్ ని చూసిన రష్మిక అతనికి ఫిదా అయిపోయింది. అద్భుతంగా డ్యాన్స్ వేశావు, నా మనసు గెలుచుకున్నావు నువ్వు అంటూ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతటి బిజీ షెడ్యూల్ లో కూడా రష్మిక సమయం కేటాయించి ఇంత స్నేహ పూర్వకంగా మాట్లాడడం పై నెటిజెన్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు. మిగతా హీరోయిన్స్ కూడా రష్మిక లాగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 1250 సినిమాలు..వందల కోట్ల సంపాదన..రణబీర్ కపూర్ ని దాటేసిన బ్రహ్మానందం!