Samantha (3)
Samantha: సమంత(Samantha Ruth Prabhu) కి సంబంధించి ఏ చిన్న విషయం సోషల్ మీడియా లో వచ్చినా, అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది మరి. నిన్న మొన్నటి వరకు ఆమె కేవలం సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు మాత్రం ఆమె పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ ని విస్తరింప చేసుకుంది. ఈమెకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫేమ్ పలువురు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ కి కూడా లేదు అనడంలో అతిశయోక్తి లేదేమో. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న సమంతకు మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకడం వల్ల సినిమాలకు బాగా దూరమైంది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది కానీ, ఒకప్పుడు ఉన్న ఊపు ఇప్పుడు లేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది. ఇది ఇలా ఉండగా సమంతకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
Also Read: ఆరోజు మమ్మల్ని చూసి ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు – చిరంజీవి!
సమంత మొబైల్ లో ‘మై లవ్’ అని ఒక నెంబర్ ని సేవ్ చేసుకొని ఉందట. ఇప్పటికీ ఆమె ఆ కాంటాక్ట్ ని అలాగే ఉంచిందట. ఇంతకు ఆ కాంటాక్ట్ ఎవరిదీ?, సమంత తన మాజీ భర్త నాగ చైతన్య(Naga Chaitanya) ని మర్చిపోలేక అలాగే మొబైల్ లో ఉంచేసుకుందా?, లేకపోతే తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్ నెంబర్ ని ఇలా సేవ్ చేసుకుండా?..గౌతమ్ మీనన్(Gowtham Menon) అంటే సమంత కి చాలా ఇష్టం అనే విషయం అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరు కాకుండా రీసెంట్ గానే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుందని సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి అనేక ప్రైవేట్ పార్టీలకు కూడా వెళ్లారు. ఒకవేళ అతని నెంబర్ ని ఇలా సేవ్ చేసుకుందా?, ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో వచ్చాయి.
కానీ ఇవేమి నిజం కాదట, సమంత సేవ్ చేసుకున్న ‘మై లవ్’ అనే నెంబర్ తన తండ్రి గారిది అట. సమంత కి చిన్నప్పటి నుండి తన తండ్రి అంటే అమితమైన ప్రేమ అట. తన కష్టసుఖాల్లో తోడున్న ఏకైక వ్యక్తి ఆయనేనట. గత ఏడాది దురదృష్టం కొద్దీ ఆయన అనారోగ్యం తో చనిపోయాడు. అసలే మానసికంగా ఎంతో బలహీనంగా ఉన్నటువంటి సమంత కి, తానూ ఎంతో ప్రేమించిన తండ్రి చనిపోయాడంటే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని అనిపిస్తుంది కదూ. తన తండ్రి ఈ ప్రపంచం లో లేకపోయినా కూడా ఇప్పటికీ తన ఫోన్ లో ఆయన నెంబర్ ని ‘మై లవ్’ అనే సేవ్ చేసుకొని ఉందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.