Chiranjeevi (3)
Chiranjeevi: 2024 వ సంవత్సరం మెగా అభిమానులు జీవితాంతం జ్ఞాపకాలలో పదిలంగా ఉంచుకోవాల్సిన మధురమైన సంవత్సరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లోనూ విజయ దుందిభి మ్రోగించి చరిత్ర తిరగరాశాడు. నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని అందుకున్న ఏకైక రాజకీయ పార్టీ గా జనసేన ని నిలబెట్టాడు. గెలిచిన తర్వాత ఆయన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనాలు చేయడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం రోజున అతిరథ మహారథుల సమక్ష్యం లో మరోసారి తన అన్నయ్య పాదాలకు నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఈ సంఘటన గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆయన తన అన్నయ్య ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి, ఫోటో దిగడం కూడా మెగా అభిమానులు మర్చిపోలేని జ్ఞాపకాలుగా చెప్పుకోవచ్చు.
ఈ సంఘటనల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో ఏమన్నాడో ఇటీవల లండన్ టూర్ లో అభిమానులతో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతూ ‘మీ తమ్ముడు గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత మీ పాదాలకు నమస్కారం చేయడం, ప్రమాణస్వీకారం రోజున మీ ఇద్దరి ఆప్యాయత ని చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాలు ఇలా ఉంటాయా అని దేశమంతటా మీరిద్దరూ చాటి చెప్పారు అని అన్నాడు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు ఆ మధురమైన క్షణాల్లో చిరంజీవి ఎలాంటి అనుభూతి చెందాడు అని తెలుసుకోవడానికి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు ఇలా తెర పడింది.
Also Read: ‘కోర్ట్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతం నుండి 20 కోట్లు!
పూర్తి స్థాయి వీడియో కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ, అది వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ మీటింగ్ కాబట్టి. ఆ మీటింగ్ కి వెళ్లిన ఒక అభిమాని చిరంజీవి మాట్లాడుతుండగా ఈ వీడియో ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే అనిల్ రావిపూడి మూవీ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ తన కాల్ షీట్స్ ని ఫుల్ బిజీ గా మార్చేసుకున్నాడు మెగాస్టార్.
ఆ రోజు ప్రధాని మోడీ ఏమన్నారంటే..! | #Chiranjeevi #PawanKalyan #PMNarendraModi | Oneindia Telugu pic.twitter.com/9WEqAAEA2g
— oneindiatelugu (@oneindiatelugu) March 21, 2025