Ravi Teja (2)
Ravi Teja: మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) కి ఈమధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. కమర్షియల్ సినిమా చేసినా, కొత్త తరహా కథలు చేసిన దురదృష్టం కొద్దీ ఆ చిత్రాలు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. తనకి మిరపకాయ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన హరీష్ శంకర్ తో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని చేసి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. రవితేజ రీసెంట్ గా నటించిన అన్ని సినిమాలలో , అతి చెత్త సినిమా అంటే ఇదే అనొచ్చు. అందుకే ఆయన తన తదుపరి చిత్రాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. రవితేజ రాబోయే సినిమాలన్నీ కూడా మినిమం గ్యారంటీ హిట్స్ లాగానే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఇటీవల కాలంలో ఎలాంటి సూపర్ హిట్ సినిమాలను అందిస్తుందో మనమంతా చూసాము.
Also Read: ఆరోజు మమ్మల్ని చూసి ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు – చిరంజీవి!
ఈ సంస్థ నుండి ఈ నెల 28 ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం పై యూత్ ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేయగల సత్తా ఉన్న చిత్రమిది. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) తో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రవితేజ సినిమా ఒకటి తెరకెక్కనుంది. ఈ చిత్రం సూపర్ హీరో జానర్ లో ఉంటుందట. రవితేజ లాంటి మాస్ హీరో ఇలాంటి జానర్ ని ఎంచుకోవడం ఆశ్చర్యార్ధకం. స్టోరీ చెప్పడం కూడా అయిపోయింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా అకనిపించడం లేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందట.
అంటే ఆగష్టు వరకు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు అన్నమాట. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్. ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఆయన ఇదే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘అనార్కలి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు కిషోర్ తిరుమల. మమిత బైజు(Mamitha Baiju), కాయాదు లోహార్(Kayadu Lohar) ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూపర్ హీరో జానర్ చిత్రం కంటే ముందు ‘అనార్కలి’ మొదలు అయ్యేలా ఉంది. మరో పక్క మాస్ జాతర టీజర్ చూసిన తర్వాత రవితేజ కి మరో భారీ హిట్ రాబోతుంది అనే కల కొట్టొయోచినట్టు కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లాగా రవితేజ భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.