Samantha: నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత చాలా మారిపోయింది. అప్పటివరకు తనతో సన్నిహితంగా ఉన్న దర్శకులను నిర్మాతలను సడెన్ గా కట్ చేసేసింది. దీనికితోడు వాళ్ళు కలగజేసుకుని మాట్లాడినప్పటికీ.. గతానికి భిన్నంగా వారితో ఆమె స్పందించింది. హీరోయిన్ గా కంటే కూడా అక్కినేని కోడలుగా సామ్ అప్పుడు వారితో బిహేవ్ చేసింది.
అయితే, చివరకు చైతు నుంచి సమంత విడిపోయింది. విడిపోయిన తర్వాత దగ్గర నుంచి ఆమెలో హీరోయిన్ నిద్ర లేచింది. ఎలాగైనా మళ్ళీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎంతగానో కష్ట పడుతోంది. కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనదే డౌట్. ఇప్పటికైతే సమంతకు కొన్ని అవకాశాలు వచ్చాయి.
కాకపోతే ఆ సినిమాల వల్ల ఆమెకి ‘హైప్’ వచ్చే ఛాన్స్ లేదు. ఆమెకు గత వైబోగం రావాలి అంటే.. పెద్ద దర్శకుడి సినిమా రావాలి. లేదా పెద్ద హీరో సినిమా అయినా రావాలి. అప్పుడే సమంతకు మళ్ళీ బ్రేక్ వస్తోంది. అలాగే మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది. మరి ఈ మధ్యలో ఎన్ని చిన్నాచితకా సినిమాలు చేసినా ఉపయోగం ఏమి ఉండదు.
నిజానికి త్రివిక్రమ్ అప్పట్లో సమంతకు మంచి సన్నిహితుడు. ఆమె కూడా ఆయనను ఎంతగానో ప్రత్యేకంగా చూసేది. కానీ ఇంతలో చైతుతో ప్రేమలో పడటం.. పెళ్ళి కూడా చేసుకోవడంతో త్రివిక్రమ్ ను దూరం పెట్టింది. ఇక ఈ మధ్య త్రివిక్రమ్ ను సామ్ కలిసిందట. అయితే, త్రివిక్రమ్ మాత్రం ఆమె గతంలో చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేదట.
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం, బెంబేలెత్తిపోయిన కాజల్
ఏది ఏమైనా సమంత ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఎలాగూ సామ్ విడాకుల వ్యవహారం కూడా ముగిసిన ముచ్చటగా మిగిలిపోయింది కాబట్టి.. సామ్ మళ్లీ ట్రెండింగ్ లోకి రావాలి అంటే.. ‘శాకుంతలం’ సూపర్ హిట్ అవ్వాలి.
Also Read: Sonu Sood: ఈ కంటెస్టెంట్ కి సోనూసూద్ అండా దండా
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Samantha meet trivikram after divorce
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com