https://oktelugu.com/

Samantha on Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ పై యుద్ధం ప్రకటించిన సమంత.. షాక్ లో ఫాన్స్

Samantha on Akkineni Family: సమంత మరియు నాగ చైతన్య లు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్ లో వాళ్ళు ఫుల్ బిజీ అయిన సంగతి మన అందరికి తెలిసిందే..సమంత అయితే టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ ని దాటి ఏకంగా హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది..ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు, అయితే అక్కినేని ఫామిలీ కంటే సమంత దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2022 / 04:55 PM IST
    Follow us on

    Samantha on Akkineni Family: సమంత మరియు నాగ చైతన్య లు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్ లో వాళ్ళు ఫుల్ బిజీ అయిన సంగతి మన అందరికి తెలిసిందే..సమంత అయితే టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ ని దాటి ఏకంగా హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది..ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు, అయితే అక్కినేని ఫామిలీ కంటే సమంత దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అనే సంగతి మన అందరికి తెలిసిందే, ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు గా నమోదు చేసుకున్నాయి..అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక్క వార్త అభిమానులను షాక్ కి గురి చేస్తోంది, అదేమిటి అంటే సమంత చేతిలో ప్రస్తుతం యశోద మరియు శాకుంతలం అనే రెండు పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో యశోద అనే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది..ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్న ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉన్నది.

    Samantha on Akkineni Family

    అనుష్క కి అరుంధతి సినిమా తన కెరీర్ లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో..సమంత కెరీర్ లో కూడా యశోద అనే సినిమా అదే స్థాయిలో నిలిచిపొయ్యే చిత్రం గా మిగిలిపోతుంది అని ఆమె బలంగా నమ్ముతుంది అట, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది అని సమాచారం..అయితే ఈ సినిమాని అక్కినేని వారసుల సినిమాలకు పోటీ గా దింపబోతుంది అట సమంత..ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని అఖిల్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శెరవేగంగా సాగుతుంది..జూన్ నెలాఖరున షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాని ఆగష్టు 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..దీనితో సమంత యశోద మరియు అఖిల్ ఏజెంట్ సినిమాలకు మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తప్పేటట్టు లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..సమంత కి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఉండడం తో ఈ సినిమా ప్రేక్షకుల్లో సరైన అంచనాలను ఏర్పర్చగలిగితే కచ్చితంగా ఏజెంట్ సినిమా వసూళ్లకు గండి కొడుతోంది అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..కానీ ఇద్దరిలో ఒక్కరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేనట్టు కనిపిస్తుంది.

    Samantha on Akkineni Family

    Also Read: ఎన్టీఆర్ ఫ్యామిలీ న‌న్ను అలా ట్రీట్ చేస్తారు.. య‌శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    మరో పక్క సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో అమిర్ ఖాన్ హీరో గా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా అనే సినిమా లో ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కూడా ఆగష్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది అట..సమంత నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ యశోద కూడా హిందీ లో విడుదల అవ్వబోతుండడం తో ఒక్కేసారి అటు నాగ చైతన్య కి ఇటు అఖిల్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సమంత నుండి తీవ్రమైన పోటీ ఎదురు అవ్వబోతుంది అనే చెప్పాలి..మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..సమంత ఇటీవలే అక్కినేని అఖిల్ పుట్టిన రోజు నాడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బర్త్ డే విషెస్ తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..అక్కినేని కుటుంబం తో సంబంధం లో ఉన్నప్పుడు ఆమె ఎలా అయితే అఖిల్ తో ఉండేదో,ఇప్పుడు కూడా స్నేహం గా ఉంది అని ఆ పోస్ట్ ని చూసి చెప్పవచ్చు, మారి వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ సఖ్యత వల్ల ఎవరో ఒక్కరు బాక్స్ ఆఫీస్ పోరు నుండి తప్పుకుంటారా లేదా పోటీ పెడుతారా అనేది చూడాలి.

    Also Read: కూతురు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్ అలీ

    Tags