Vijay political party controversy: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ భారీ సక్సెస్ లను సాధించాడు. సూపర్ స్టార్ గా అవతరించిన ఆయన తన అభిమానుల కోరిక మేరకు ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… హెల్త్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి తన అభిమానులే తనకు ముఖ్యమని ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ లాంటి నటుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లను సాధించి గొప్ప క్రేజ్ ను పొందిన నటుడు దళపతి విజయ్ కావడం విశేషం… రీసెంట్ ఆయన టీవీకే అనే పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక అప్పటినుంచి ఆయనకు చాలా సవాల్లైతే ఎదురవుతున్నాయి.
ఆయన హీరోగా నటించిన ‘జననాయగన్’ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు… సెన్సార్ బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇక దానికి తోడుగా తన భార్య అయిన సంగీత సైతం తనకు విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కడంతో ఆయన పరువు పోయినంత పని అయింది.
ఇక దీనిని ఆసరాగా చేసుకొని అధికార పార్టీ వాళ్లు సైతం విజయ్ ని విపరీతంగా విమర్శిస్తున్నారు. నిజానికి విజయ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలను నమ్ముకొని ఆయన ముందుకు సాగరట. అక్కడున్న కమల్ హాసన్, విక్రమ్ లాంటి హీరోలు తనకు బ్యాక్ ఎండ్ లో నుంచి సపోర్ట్ చేస్తామని రాజకీయ రంగానికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రచారంలో కూడా మేము భాగవమవుతామని చెప్పారట.
కానీ ఇప్పుడు ఎవరు కూడా తన వైపు చూడడం లేదని అసలు ప్రచారం గురించి కాదు తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనను కలవడానికి కూడా ఎవరు రావట్లేదు అంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతూ బాధపడుతున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా రాజకీయం అనేది ఒక బురద లాంటిది. దాంట్లోకి దిగితే చాలా రకాల విమర్శలను ఎదుర్కోవాలి…