Mumbai Indians IPL 2022: ఐపీఎల్ సీజన్లో చెత్త గా ఆడి రికార్డులు సొంతం చేసుకుంటోంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్ గా నిలిచినా ప్రస్తుతం మాత్రం ఆ స్థాయిలో ఆడకుండా చెత్తగా ఆడుతూ తనలోని లోపాలను బహిర్గతం చేసుకుంటోంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన జోరు మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. 2013, 2015, 2017, 2019, 2020లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న జట్టు ప్రస్తుతం మాత్రం ఇబ్బందుల్లో పడుతోంది. ఓటమిలతోనే కాలం వెళ్లదీస్తోంది. దీంతో అభిమానుల చీత్కారాలకు గురవుతోంది.

ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ రెండు కొత్త జట్ల రాకతో పేలవంగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్ సీజన్లలో తొలి ఐదు మ్యాచుల్లో వరుసగా ఓడిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. బుధవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలై చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఆటగాళ్లు సైతం తమ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదు. దీంతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
2014లో ఆడిన ప్రతి ఆటలోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తరువాత ఇప్పుడే ఆ రికార్డును తిరగరాసింది. ముంబై జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా సరైన రీతిలో ప్రదర్శన చేయడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ బలహీనంగా కనిపిస్తోంది. గతంలో బుమ్రా, బౌల్డ్, కృనాల్, రాహుల్ బలంగా ఉన్నా ప్రస్తుతం మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు.

బుమ్రాకు సహకారం అందించే వారు లేకపోవడంతో జట్టు ప్రదర్శన అధ్వానంగా మారుతోంది. ఫలితంగా అపజయాలే పలకరిస్తున్నాయి. ఇాలాగైతే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానమే ఖాయం చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానం దక్కడంతో ఇక ఏం చేసేదని నిట్టూరుస్తున్నారు. దీంతో మిగతా జట్ల కంటే పేలవ ప్రదర్శన చేసి ముంబై అందరిలో చులకన అయిపోయింది.
Also Read:IPL 2022: వరుస ఓటములతో ముంబై ఇండియన్స్… రెండో సారి జరిమానా