World’s Costliest Mangoes: పండ్లలో రారాజుగా పిలిచేది మామిడిపండ్లనే. వాటికి ఉన్న విలువ అలాంటిది మరి. సీజన్ లో పండే మామిడిపంట్లను తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటి ధర మామూలుగా అయితే రూ. 30-50 వరకు ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువైతే రూ. 150 వరకు పలుకుతుంది. దీంతో ప్రజలు వీటిని తినేందుకు ముందుకు వస్తారు. జ్యూస్ చేసుకుని మరీ తాగుతారు. ప్రొటీన్లు కూడా అంతే స్థాయిలో ఉండటంతో వీటిని ఎక్కువగా తీసుకునేందుకు కొనుగోలు చేస్తారు.

జపాన్ లో పండే తైయానో తమాగో రకానికి చెందిన మామిడి పండ్ల ధర మాత్రం రూ. లక్షల్లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో వాటిని సాగు చేస్తే ఇక అదృష్ట వంతులు కావడమే. తాజాగా మధ్యప్రదేశ్ లోని రాణి, సంకల్ప్ పరిహార్ అనే దంపతులు ఈ రకానికి చెందిన మామిడి చెట్టును తమ తోటలో పెంచారు. ఇంకేముంది దీని గురించి తెలిసిన వారు దొంగతనానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో వారు ఆ చెట్టుకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం తెలిసిందే.
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన మొక్కను వారు పెంచారు. అది జపాన్ కు చెందిన తైయానో తమాగో రకానికి చెందిందని తెలియడంతో అవాక్కయ్యారు. జపాన్ లో దీన్ని అత్యంత ధనవంతులైన వారు తమ ఇష్టమైన వారికి బహుమతిగా అందజేస్తారు. కిలో మామిడి పండ్ల ధర రూ. 3 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది 2017లో ఈ మామిడి ధర రికార్డు స్థాయిలో 5,3600 పలికింది. మన కరెన్సీలో రూ. 2.70 లక్షలు ఉంటుందని తెలిసిందే.

తైయానో తమగో రకం మామిడి పండ్లు పైనాపిల్, కొబ్బరి కాయ రుచిని కలిగి ఉంటుంది. ఇది సూర్యరశ్మితో పండుదుంది. అందుకే దీనికి సూర్యుని గుడ్డు అని పేరు పెట్టారు. దీన్ని సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తారు. క్వింటాల్ పండ్లు రూ. 3 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఈ పండ్లను సాగుచేస్తే దారిద్ర్యం పోయి సంపన్నులు కావొచ్చు. కానీ దీన్ని పెంచితే తిప్పలే ఎక్కువ. దొంగల భయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి సాగుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
Also Read:Yash- NTR: ఎన్టీఆర్ ఫ్యామిలీ నన్ను అలా ట్రీట్ చేస్తారు.. యశ్ సంచలన వ్యాఖ్యలు