Varanasi movie Naatu Naatu range song: #RRR చిత్రం గ్లోబల్ వైడ్ గా అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ‘నాటు నాటు’ సాంగ్. రామ్ చరణ్ , ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ ఊగిపోయారు. అందుకే ఆ పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. తెలుగు సినిమాకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమా కే గర్వ కారణం అయ్యింది ఆ పాట. అలాంటి మ్యాజిక్ ని మళ్లీ రిపీట్ చేయడం అనేది ఎవరికైనా కష్టమే, కానీ రాజమౌళి గట్టిగా తల్చుకుంటే, ఆయనకు అది వెన్నతో పెట్టిన విద్య లాగా అవుతోంది. ‘వారణాసి’ తో ఈ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడు అట. మగధీర లాంటి సినిమాని మళ్లీ ఎవ్వరూ తియ్యలేరేమో అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే బాహుబలి తో అంతకు మించిన సినిమానే తియ్యగలను అని నిరూపించుకున్నాడు రాజమౌళి.
ఇప్పుడు కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తాడు , అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు. ‘వారణాసి ‘ లో ఒక పాటని లాటిన్ స్టైల్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నాడు అట. ఈ పాటని శంకర్ అనే సీనియర్ కొరియోగ్రాఫర్ ఆద్వర్యం లో తెరకెక్కించనున్నారు. మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా కూడా ఈ పాటలో ఉంటుంది. అంతే కాకుండా వందలాది మంది లాటిన్ డ్యాన్సర్స్ కూడా ఈ పాటలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో లాటిన్ ఫ్లేవర్ సాంగ్స్ ని ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించలేదు. అలాంటిది రాజమౌళి ఈ ప్రయోగం చేయబోతున్నాడు కాబట్టి కచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రేక్షకులకు ఈ పాట కచ్చితంగా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్ గానే మూవీ టీం మొత్తం జార్జియా లో ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చారు.
త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ప్రియాంక చోప్రా ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించింది. అంతే కాదు అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న మొట్టమొదటి సినిమా కూడా ఇదే అట. సినిమా సగానికి పైగా విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తిన్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టాలని, అనుకుంటున్నారు. డిసెంబర్ నుండి గ్రాండ్ గా ప్రొమోషన్స్ మొదలు పెడతారట. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, హాలీవుడ్ లో కూడా ప్రొమోషన్స్ చాలా బలంగా చేయబోతున్నారని టాక్ .