Samantha: భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటుంది. వేళ కాని వేళ ఆమెకు విడాకులు అయ్యాయి. సమంత ప్రస్తుత వయసు 36 ఏళ్ళు. ఆమె వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం చేస్తే ఏజ్ బార్ అవుతుంది. మరోవైపు నాగ చైతన్య అదే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా లభించాయి. లండన్ లో నాగ చైతన్య, శోభిత జంటగా చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు.
నాగ చైతన్య టీమ్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ వార్తలను ఖండిస్తున్నా పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. సడన్ గా ఏదో ఒకరోజు నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. మరోవైపు సమంత కూడా తోడు వెతుక్కుంటున్నారట. ఆమె పెళ్లైన బాలీవుడ్ హీరోకి మానసిచ్చారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం హీరో వరుణ్ ధావన్ తో సమంత ప్రేమలో పడ్డారట. ఇద్దరూ చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారట.
వీరిద్దరూ జంటగా సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ షూట్లో సమంతకు వరుణ్ ధావన్ దగ్గయ్యారయ్యారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇటీవల వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ విడిపోతున్నట్లు వార్తలు రావడం విశేషం. 2021లో నటాషాను వరుణ్ ధావన్ వివాహం చేసుకున్నారు. నటాషా ఫ్యాషన్ డిజైనర్ కాగా, ఏళ్ళ తరబడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
ఇక సమంత మీద తరచుగా ఈ తరహా పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సిటాడెల్ తో పాటు ఖుషి చిత్రంలో సమంత నటిస్తున్నారు. సమంతకు జంటగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఖుషి మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సమంత లాస్ట్ రిలీజ్ శాకుంతలం నిరాశపరిచింది. కాగా సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.