Salman Khan: ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరూ బాలీవుడ్ దర్శకుల కంటే కూడా సౌత్ సినిమా దర్శకుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. దానికి కారణం సౌత్ నుంచి వచ్చే దర్శకులు వైవిద్య భరితమైన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను సాటిస్ఫై చేయడంలో సౌత్ దర్శకులు సక్సెస్ అవుతున్నారు.
ఇక అందులో భాగంగానే అక్కడ ఉన్న హీరోలందరూ తెలుగు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి షారుక్ ఖాన్ కూడా అట్లీ డైరెక్షన్ లో ‘జవాన్ ‘ అనే సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 1000 కోట్లకు పైన కలెక్షన్లను కూడా రాబట్టారు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక తమిళ్ డైరెక్టర్ అయిన మురగదాస్ తో ప్రస్తుతం ‘సికిందర్ ‘అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.
నిజానికైతే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ బాద్షా అయిన షారుఖాన్ కి సూపర్ సక్సెస్ ని అందించిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి సికిందర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ అది పూర్తి చేసి అట్లీ తో చేయబోయే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక మొత్తానికైతే సల్మాన్ ఖాన్ వరుసగా సౌత్ సినిమా దర్శకులను ఎంచుకోవడం అనేది ఆయన చేస్తున్న మంచి పని అంటూ ట్రేడ్ పండితులు సైతం సల్మాన్ ఖాన్ సినిమా లైనప్ చూసి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…