https://oktelugu.com/

Bhairava Anthem Song: కల్కి నుండి భైరవ యాంథమ్ ఫుల్ సాంగ్ వచ్చేసింది… ఆ గెటప్ లో ప్రభాస్ హైలెట్ భయ్యా!

Bhairava Anthem Song: ఎట్టకేలకు ఓ ప్రమోషనల్ సాంగ్ మాత్రం షూట్ చేసి వదిలారు. భైరవ యాంథమ్ పేరుతో విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన స్వరాలు బాగున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : June 17, 2024 / 05:12 PM IST

    Bhairava-Anthem-Song

    Follow us on

    Bhairava Anthem Song: కల్కి 2829 AD టీమ్ ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 40 కోట్ల వ్యయంతో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూచర్ కార్ బుజ్జిలో ప్రభాస్ వేదిక మీదకు ఎంట్రీ ఇచ్చాడు. బుజ్జిని దేశంలోని అత్యుత్తమ ఇంజనీర్స్ తయారు చేశారు. కాగా కల్కి చిత్రం నుండి ఇప్పటి వరకు ఒక్క సాంగ్ కూడా విడుదల కాలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ మూవీ తరహాలో కల్కి రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్, కమర్షియల్ అంశాలు కల్కి లో ఉండే సూచనలు కనిపించడం లేదు.

    కాగా ఎట్టకేలకు ఓ ప్రమోషనల్ సాంగ్ మాత్రం షూట్ చేసి వదిలారు. భైరవ యాంథమ్ పేరుతో విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన స్వరాలు బాగున్నాయి. సింగర్ దిల్జీత్ దోసాన్జ్, దీపక్ బ్లు, సంతోష్ నారాయణన్ భైరవ యాంథమ్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

    కల్కి మూవీలో ప్రభాస్ భైరవ అనే పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర తీరు ఎలా ఉంటుందో భైరవ యాంథమ్ లో తెలియజేశారు. భైరవ పాత్ర కోసం రాసిన లిరిక్స్ చూస్తుంటే… నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. భైరవ పాత్రలో స్వార్థం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. భైరవ యాంథమ్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరణ జరిపారు. ఈ సాంగ్ లో సింగర్ దిల్జీత్, హీరో ప్రభాస్ లను చూడొచ్చు. తలపాగాలో సిక్కు గెటప్ లో ప్రభాస్ లుక్ అదిరింది. వీడియోలో అది హైలెట్ అని చెప్పాలి.

    కల్కి వరల్డ్ వైడ్ జూన్ 27న విడుదల కానుంది. దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్. దిశా పటాని సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుంది. అమితాబ్ కథలో కీలకమైన అశ్వథామ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ దీపికా పదుకొనె కడుపులో పెరుగుతున్న బిడ్డకు రక్షకుడిగా అమితాబ్ పాత్ర ఉంది. ట్రైలర్ లో అది రివీల్ చేశారు. మరో కీలక రోల్ చేస్తున్నాడు కమల్ హాసన్. ఈయన లుక్ ని ట్రైలర్ లో రివీల్ చేశాడు. కమల్ హాసన్ పాత్ర ఎలా ఉంటుంది అనేది సస్పెన్సు. అశ్వినీ దత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.