Kerala: ఛీ ఛీ ఈమెను తల్లి అంటారా?

Kerala: కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఓ కేసు విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు విన్న తర్వాత న్యాయమూర్తి ఓ తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 18, 2024 10:34 am

Kerala Woman Jailed For 40 Years

Follow us on

Kerala: ఈ సృష్టిలో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని తన పిల్లల బాగోగులు చూసుకుంటుంది. తాను ఉపవాసం ఉండి.. పిల్లల కడుపు నింపుతుంది. అందుకే మాతృదేవోభవ అనే నానుడి పుట్టింది.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఈ తల్లి పాత్ర పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆమె చేసిన పని అంత చెండాలమైనది కాబట్టి.. అదంతా చదివిన తర్వాత ఛీ ఛీ ఈమెను కూడా తల్లి అంటారా.. అనే ఏవగింపు మీలో కచ్చితంగా కలుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఓ కేసు విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలు విన్న తర్వాత న్యాయమూర్తి ఓ తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 20వేల జరిమానా కూడా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించని సమయంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రంలో మానసిక స్థితి సరిగ్గా లేని భర్తను ఓ భార్య వదిలిపెట్టి వెళ్ళి పోయింది. ఆమెకు ఏడు సంవత్సరాల కూతురు ఉంది. ఈ నేపథ్యంలో శిశుపాలన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అతడు ఈమెతో శారీరక సుఖం అనుభవిస్తూనే.. ఆమె ఏడు సంవత్సరాల చిన్నారిపై కన్నేశాడు. పలుమార్లు ఆమె ముందే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి తనపై జరుగుతున్న దారుణాన్ని తల్లితో చెప్పుకుంది. అయితే ఆమె తల్లి ప్రియుడిని నిలదీయాల్సింది పోయి.. కూతురిని బెదిరించింది. పైగా ఈ విషయం బయటకు చెప్తే ప్రాణాలతో ఉండవని హెచ్చరించింది. దీంతో శిశుపాలన్ మరింత రెచ్చిపోయాడు. అటు తల్లితో, ఇటు కూతురితో ఏకకాలంలో చేయకూడని పనులు చేసేవాడు.

అయితే ఆ మహిళ ఇంటికి చుట్టంగా 11 సంవత్సరాల బాలిక(ఆ మహిళ సోదరి కూతురు) వచ్చింది. ఆ బాలికపై కూడా శిశుపాలన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక తిరిగి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తర్వాత, జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది. దీంతో ఆ వృద్ధ మహిళ తన కూతురికి ఫోన్ చేసి.. శిశుపాలన్ ను వదిలి పెట్టాలని హెచ్చరించింది..కానీ, ఆమె తన తల్లి మాట వినిపించుకోలేదు.. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. శిశు పాలన్ కు ఆ మహిళ దూరమైంది. ఇదే సమయంలో మరో వ్యక్తికి దగ్గరైంది. అతడు కూడా ఆ మహిళతో శారీరక సుఖం అనుభవించుకుంటూనే.. ఆమె ఏడు సంవత్సరాల చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆ మహిళకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయింది. చివరికి ఆ చిన్నారి తన పట్ల జరుగుతున్న దారుణాన్ని ఆమె నానమ్మ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి తల్లి, ఆమె మొదటి ప్రియుడు శిశుపాలన్, రెండవ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చి.. చిల్డ్రన్స్ హోమ్ కు పంపించారు. అయితే ఈ కేసు తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు రాగా.. కేసును విచారించిన న్యాయమూర్తి తల్లికి 40 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కాగా, ఈ దారుణాలు 2018 జూలై నెల నుంచి 2019 వరకు జరిగాయి. ఆ వృద్ధురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి.