https://oktelugu.com/

Mr.Bachchan Teaser Review : మిస్టర్ బచ్చన్ టీజర్ రివ్యూ : నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్, అంచనాలు పెంచేసిన రవితేజ!

Mr.Bachchan Teaser Review ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2024 / 08:23 PM IST

    Ravi Teja Mr.Bachchan Teaser Review

    Follow us on

    Mr.Bachchan Teaser Review : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. క్రాక్ మూవీ తర్వాత ఆయన జోరు పెంచారు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు విడుదల చేస్తున్నారు. 2024 ప్రారంభంలో ఈగల్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న హరీష్ శంకర్ ఆ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ తెరపైకి తెచ్చాడు.

    ఈ మూవీ షూటింగ్ మొదలై ఓ ఐదారు నెలలు అవుతుంది. హరీష్ శంకర్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడని విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతుంది. చడీ చప్పుడు లేకుండా మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం నిడివి కలిగిన టీజర్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధానంగా సాగింది. మిస్టర్ బచ్చన్ పీరియాడిక్ మూవీ అని తెలుస్తుంది. 80ల కాలం నాటి వాతావరణం సృష్టించారు. ఇక రవితేజ లుక్ అదిరింది. యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా ఉన్నాయి.

    టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. కాగా జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. ఆయన మరోసారి డార్క్ షేడ్స్ కలిగిన విలన్ రోల్ లో అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హోమ్లీ లుక్ లో మెస్మరైజ్ చేసింది. మొత్తంగా టీజర్ అంచనాలు పెంచేసింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజకు హిట్ గ్యారంటీ అనిపిస్తుంది.

    గతంలో రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిరపకాయ్ అనే మూవీ వచ్చింది. అండర్ కవర్ ఆఫీసర్ గా రవితేజను హరీష్ శంకర్ గొప్పగా ప్రజెంట్ చేశాడు. మిరపకాయ్ సూపర్ హిట్ కొట్టింది. చాలా గ్యాప్ అనంతరం మిస్టర్ బచ్చన్ తో వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.