Ram Charan: #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. సుమారుగా ఆరేళ్ళ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం అవ్వడంతో ఈ సినిమాపై అటు అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మేనియా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభించేసాడు. శరవేగంగా జరుగుతున్న మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలోనే ఆయన రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమాలో తమిళ హీరో సూర్య ఒక కీలక పాత్ర చేయబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సూర్య స్థానంలో సల్మాన్ ఖాన్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సినిమాలో ఈ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ కథని మొత్తం మలుపు తిప్పే పాత్రనట. కచ్చితంగా ఒక సూపర్ స్టార్ హోదాలో ఉన్నవాళ్లే చెయ్యాల్సిన పాత్ర ఇది. అందుకే సల్మాన్ ఖాన్ సంప్రదించే యోహానలో ఉందట మూవీ టీం. రామ్ చరణ్ కి సల్మాన్ ఖాన్ మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ ఒక్క మాట అడగగానే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇందులో ఆయన నటించినందుకు గానూ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. బదులుగా రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రంలోని ఒక పాటలో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ తో కలిసి చిందులేస్తాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది, ఒకరికోసం ఒకరు ఏదైనా చేయగలిగేంత బంధం ఉంది. ఆ చనువుతోనే రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ని కలిసి రిక్వెస్ట్ చేయబోతున్నాడట. రామ్ చరణ్ ఏది అడిగినా సల్మాన్ ఖాన్ కాదు అనడు కాబట్టి, సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటించబోతున్నాడు అనేది ఖరారు చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ ఉండడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ చిత్తానికి మంచి ఓపెనింగ్స్ బాగా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి.