https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..రికార్డ్స్ కొట్టడానికి ముందున్న టార్గెట్స్ ఇవే!

రీసెంట్ గానే లండన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అక్కడ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు బుకింగ్స్ ప్రారంభించిన ప్రతీ లొకేషన్ లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 03:22 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్, మూడు సాంగ్స్ విడుదల అవ్వగా వాటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే నాల్గవ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. రీసెంట్ గా విడుదలైన ‘నానా హైరానా’ అనే డ్యూయెట్ మెలోడీ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు యూట్యూబ్ లో 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. విజువల్ పరంగా కూడా ఈ పాట వేరే లెవెల్ లో ఉండబోతుంది అనేది లిరికల్ వీడియో ని చూస్తేనే మీ అందరికీ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడిప్పుడే ఒక్కో దేశంలో ప్రారంభం అవుతూ వస్తుంది.

    రీసెంట్ గానే లండన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అక్కడ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు బుకింగ్స్ ప్రారంభించిన ప్రతీ లొకేషన్ లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. అక్కడి ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకి 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. నెల రోజుల ముందు ఒక సినిమాకి ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది ఇదే తొలిసారి. #RRR చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు ఈతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు కొనుగోలు చేసారు.

    ఈ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ చిత్రాన్ని విడుదల చెయ్యనంత గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 14 వ తారీఖు నుండి బుకింగ్స్ మొదలు కాబోతున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా తెలిపింది మూవీ టీం. రీసెంట్ గా విడుదలైన ‘దేవర’, ‘కల్కి’, ‘పుష్ప 2’ చిత్రాలు కేవలం ప్రీమియర్ షోస్ నుండే మూడు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అంత రేంజ్ ఉందా లేదా అనేది ఈ 14వ తేదీన మొదలు కాబోయే అడ్వాన్స్ బుకింగ్స్ తో తేలనుంది. రామ్ చరణ్ అభిమానులు ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు ప్రీమియర్స్ గ్రాస్ ని పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కల్కి’ చిత్రానికి దాదాపుగా ప్రీమియర్ షోస్ నుండి నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. మరి ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆ రికార్డుని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.