https://oktelugu.com/

Adilabad Girl: పుష్ప 2 పీలింగ్స్ పాట పాడింది ఈ ఆదిలాబాద్ బిడ్డనే.. ఆమె ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటేస్ట్ మూవీ ‘పుష్ప 2’కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీకి క్రేజ్ తగ్గడం లేదు. ఇందులో అల్లు అర్జున్ తో పాటు, రష్మిక మందానా, తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ చేసిన ఈ మూవీ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 10, 2024 / 03:53 PM IST

    Laxmidasa singer

    Follow us on

    Adilabad Girl: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటేస్ట్ మూవీ ‘పుష్ప 2’కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీకి క్రేజ్ తగ్గడం లేదు. ఇందులో అల్లు అర్జున్ తో పాటు, రష్మిక మందానా, తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ చేసిన ఈ మూవీ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని ‘మొరటోడు నా సామి’ అనే సాంగ్ రిలీజ్ కాకముందే పాపులర్ అయింది. ఇప్పుడు రిలీజ్ అయిన తరువాత ‘ఆరింటికోసారి.. నువ్వు పక్కనుంటే.. ఫీలింగ్స్’ అనే సాంగ్ ఊర్రూతలూటిస్తోంది. ఫాస్ట్ బీట్ గా ఉన్న ఈ సాంగ్ పై ఇప్పటికే చాలా మంది స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ సాంగ్ పాడింది ఎవరు? అనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

    టాలెంట్ ఉంటే సాధించనిది అంటూ ఏదీ ఉండదని కొందరు విజేతలు చెబుతూ ఉంటారు. కానీ కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే కొందరు మాత్రం తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇలాంటి వారికి ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం తలుపు తడుతుంది. జానపద గేయాలతో సంగీత ప్రియులను అలరించే సింగర్లు ఎందరో ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. ఇలాంటి వారిలో సింగర్ లక్ష్మీదాస్ ఒకరు.  ఈమె పేరు చెప్పగానే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఆ పాడిన పాటలు వింటే ఠక్కున గుర్తుకు వస్తుంది. ఆమె పాడిన కొన్ని సాంగ్స్ ఫేమస్ అయ్యాయి.

    ‘ఓ బావో సైదులు, అందాల నా మొగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ అనే పాటలు యూ ట్యూబ్ లో క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ పాటన్నలీ సింగర్ లక్ష్మీదాస్ పాడారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం గన్నోర మారుమూల గ్రామానికి చెందిన దాస లక్ష్మణ్, జయశీల దంపతులకు కుమార్తె లక్ష్మి. ఈమె తన తల్లి పాడే మరాఠి కీర్తనలు, మరాఠీ పాటలను పాడుతుండగా.. వాటిని అనువదం చేసి తెలుగులో పాడుతూ ఉండేది. అలా ప్రతి కార్యక్రమంలో తన వంతుగా ప్రతిభ చూపేది. ఆ తరువాత జానపద గేయాలను పాడుతూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

    లక్ష్మీదాస్ ప్రతిభను చూసి కుంచె రఘ తన బృందంలో అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఈమెకు ‘ఇదే బ్యాచ్’ అనే సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘దసరా’ సినిమాలో పాడేందుకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా పుష్ప 2 సినిమాలో తన గొంతు వినిపించారు. అయితే పుష్ప 2 ద్వారా లక్ష్మీ దాస్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న తాను ఇంతటీ స్టేజికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీదాస్ పలు మీడియాల్లో ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే లక్స్మీదాస్ కు మరెన్నో అవకాశాలు రావాలని పలువురు కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.