Mana Shankara Varaprasad Garu remake: అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాలకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. రీసెంట్ గానే తమిళ స్టార్ హీరో విజయ్ ‘జన నాయగన్’ చిత్రం చేసాడు. ఈ సినిమా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టు కేసుల్లో చిక్కుకొని విడుదల కాలేదు. ఈ చిత్రం సంగతి పక్కన పెడితే గత సంక్రాంతికి అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ హీరో గా నటించబోతున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని నిర్మించిన దిల్ రాజు నే, ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి నుండి సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) కూడా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి(Megastar Chiranjeevi) కి బాలీవుడ్ లో అత్యంత ఆప్త మిత్రుడు, సోదర సమానుడు అయిన సల్మాన్ ఖాన్(Salman Khan) ఈ చిత్రాన్ని రీసెంట్ గానే చూశాడట. ఆయనకు ఈ సినిమా తెగ నచ్చిందని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా నాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, బాలీవుడ్ నేటివిటీ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తీస్తే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, తనకు రీమేక్ రైట్స్ ఇప్పించాల్సిందిగా చిరంజీవి ని కోరాడట సల్మాన్ ఖాన్. అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.
ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీసి, ఆయన మ్యానరిజమ్స్ తో , డ్యాన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే ఆడియన్స్ అంతలా ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తే, మక్కీకి మక్కి దింపకుండా, సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ కి, ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్ సరైన క్రమం లో జోడించి తీస్తే కచ్చితంగా పెద్ద హిట్ అవ్వొచ్చు, లేదంటే కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. సాధ్యమైనంత వరకు బాలీవుడ్ దర్శకులే ఈ సినిమాకు పని చేస్తారు. త్వరలోనే ఈ క్రేజీ రీమేక్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు అధికారికంగా రానున్నాయి.