Vishwambhara Movie Release Date: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) త్వరలోనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నాడు. ఈ చిత్రానికి బాబీ కోల్ దర్శకత్వం వహిస్తాడు . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది ఈ చిత్రం. అంతకంటే ముందే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన భారీ బడ్జెట్ VFX చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie) విడుదల అవ్వాల్సి ఉంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మొదలు కాకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయకపోవడానికి కారణం VFX ఔట్పుట్ డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు రాలేదని. గత ఏడాది డైరెక్టర్ వశిష్ఠ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, VFX క్వాలిటీ విషయం లో అసలు తగ్గేదే లేదు. నా విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చే వరకు ఈ సినిమా బయటకు రాదు అంటూ చెప్పుకొచ్చాడు.
70 శాతం కి పైగా VFX వర్క్ పూర్తి అయ్యింది. వాటిపై నేను సంతృప్తి గా ఉన్నాను. మిగిలిన 30 శాతం VFX వర్క్ పూర్తి అవ్వాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. రీసెంట్ గానే అన్ని షాట్స్ ని డైరెక్టర్ ఫైనలైజ్ చేసాడని, మెగాస్టార్ చిరంజీవి కూడా వాటి ఔట్పుట్ పై సంతృప్తి వ్యక్తం చేసాడని అంటున్నారు. ఇక చివరిగా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ పనులు పూర్తి చేసి, విడుదల తేదీని లాక్ చెయ్యాలని అనుకుంటున్నారట. నిన్న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ విజయవంతం అయిన సందర్భంగా మీడియా పాత్రికేయులను తన ఇంటికి ఆహ్వానించి కృతఙ్ఞతలు తెలియజేసాడు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ ‘విశ్వంభర’ విడుదల తేదీని అడగ్గా, జులై 8 లేదా జులై 10న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్, ఈ చిత్రానికి ప్రస్తుతం మార్కెట్ లో ఎలాంటి బజ్ కానీ, హైప్ కానీ లేదు, రిలీజ్ అయితే మిశ్రమ ఫలితాలు దక్కొచ్చు, కాబట్టి దసరా కానుకగా విడుదల చేస్తే టాక్ కొద్దిగా డివైడ్ గా వచ్చినా కలెక్షన్స్ కుమ్మేస్తాయి అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి మెగా అభిమానులు సూచించిన తేదీ సరైనదే. కానీ రెడీ అయిపోయిన సినిమాని అన్ని రోజులు ఆపడం అసాధ్యం. కాబట్టి ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగానే జులై8 లేదా 10 తేదీలలో విడుదల చేసేస్తారని అంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ హాట్ బ్యూటీ ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషించింది. భారీ సక్సెస్ తర్వాత రాబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.