Homeజాతీయ వార్తలుAjit Pawar Plane Crash: అజిత్ పవర్ విమాన ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే..

Ajit Pawar Plane Crash: అజిత్ పవర్ విమాన ప్రమాదం.. పైలట్ల చివరి మాటలు ఇవే..

Ajit Pawar Plane Crash: మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తోపాటు మరో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైలట్‌ ఇన్‌–కమాండ్‌ సుమిత్‌ కపూర్, ఫస్ట్‌ ఆఫీసర్‌ శాంభవి కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. క్రాష్‌ ల్యాండింగ్‌కు ముందు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో వారి ఆఖరి మాటలు ఓహ్‌.. షిట్‌ (ho.. shit)అని రికార్డయ్యాయి. డీజీసీఏ సీనియర్‌ అధికారి ఈ వివరాలు వెల్లడించారు.

రికార్డింగ్‌ మాటల అర్థం ఏమిటి?
విమానం క్రాష్‌ అవడానికి కొన్ని క్షణాల ముందు పైలట్లు ఉద్విగ్నంగా ’ఓహ్‌ షిట్‌’ అని ప్రకటించిన రికార్డింగ్‌ ప్రమాద కారణాలను సూచిస్తోంది. ఇది టెక్నికల్‌ లోపం లేదా ఆకస్మిక సమస్యను వారు గుర్తించి ఈ మాటలు అని ఉంటారని తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఈ ఆడియోను పరిశీలిస్తోంది, ఇది ప్రమాదానికి దారి తీసిన కారణాలను స్పష్టం చేస్తుంది.

పవార్‌ మరణం పరిణామాలు
అజిత్‌ పవార్‌ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద శూన్యాన్ని సృష్టించింది. అంత్యక్రియలు గురువారం(జనవరి 29న) జరుగనున్నాయి. ఇది ఎన్‌సీపీలో కొత్త నాయకత్వ చర్చలకు దారి తీస్తుంది. పవార్‌ కుటుంబం, పార్టీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదం మరోమారు నేతల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

డీజీసీఏ, ఇతర ఏజెన్సీలు పరిశోధనను వేగవంతం చేశాయి. బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణ ఫలితాలు త్వరలో వెల్లడవుతాయి. ఇది భవిష్యత్‌ విమాన యాత్రల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version