Salman Khan , Ameer Khan , Shah Rukh Khan
Salman Khan and Ameer Khan : ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అమితాబచ్చన్’ (Amitha Bachhan) స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన తర్వాత ఖాన్ త్రయం పేరు బాగా వినిపించేది. ఎలాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు రావాలన్నా కూడా అమీర్ ఖాన్(Ameer Khan), షారుక్ ఖాన్(Sharukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan) ల వల్ల మాత్రమే అయ్యేది అనే అంతలా గుర్తింపును సంపాదించుకున్న ఈ స్టార్ హీరోలు ఇప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్ ను తట్టుకొని నిలబడడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు… షారుక్ ఖాన్ జవాన్ లాంటి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికు 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తన స్టామినా ఏంటో చూపించినప్పటికి ఆ తర్వాత వచ్చిన డంకీ సినిమాతో చాలా వరకు వెనుకబడిపోయాడు. ఇక ఈ సినిమా ఒక ఆవరేజ్ సినిమాగా నిలవడంతో ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. అమీర్ ఖాన్ అయితే దంగల్ సినిమా తర్వాత ‘లాల్ సింగ్ చడ్డ’ సినిమా చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని దక్కించుకోకపోవడంతో ఆయన కొంతవరకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన స్వీయ డైరెక్షన్ లోనే ఒక సినిమాను చేస్తున్నాడు… ఇక సల్మాన్ ఖాన్ సైతం ప్రస్తుతం ప్లాపుల్లోనే ఉన్నాడు. మురుగదాస్ (Murugadas) డైరెక్షన్ లో చేసిన ‘సికిందర్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : అమీర్ ఖాన్ రికార్డ్ ను కొట్టడం తెలుగు స్టార్ హీరోల వల్ల కావడం లేడా..?
ఈ సినిమా చాలా దారుణంగా ఉండటంతో సల్మాన్ ఖాన్ ఎంటైర్ కెరీర్ లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి అనే గుర్తింపుని సంపాదించుకుంది…ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలిన ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు చాలావరకు డీలా పడిపోవడంతో తమ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోల మీద విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న జనాలు సైతం ఈ హీరోలను మర్చిపోతున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు బాలీవుడ్ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు.
అందువల్లే వాళ్ళందరూ మన హీరోలకి అభిమానులుగా మారిపోయి అక్కడున్న స్టార్ హీరోలను సైతం పట్టించుకోవడం లేదనే వార్తలయితే వెలువడుతున్నాయి. వాళ్ళు ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే పర్లేదు. లేకపోతే మాత్రం తెలుగు హీరోల నుంచి ఎదురయ్యే పోటీలో వాళ్ళు నిలబడలేక పోతారనే చెప్పాలి…
Also Read : ముచ్చటగా మూడో పెళ్ళికి సిద్ధమైన అమీర్ ఖాన్…అమ్మాయి ఎవరో తెలుసా..?