Aamir Khan
Aamir Khan : తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీని మించి ముందుకు దూసుకెళ్తుంది అంటూ మనవాళ్లు భారీ ప్రగల్బాలు పలుకుతూ ముందుకు సాగుతున్నప్పటికి అమీర్ ఖాన్ (Ameer Khan) అప్పుడెప్పుడో చేసిన ‘దంగల్ ‘ (Dhangal) సినిమా రికార్డుని బ్రేక్ చేయడంలో మాత్రం మన వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిన ఈ సినిమాను టచ్ చేయలేని మన హీరోలు మన ఇండస్ట్రీ ని మాత్రం బాలీవుడ్ ని మించి ముందుకు తీసుకెళుతున్నారని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది… దంగల్ కేవలం 60 కోట్ల బడ్జెట్ తెరకెక్కి 2024 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఆ సినిమాకి దాదాపు 2000 కోట్ల వరకు ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలో బాహుబలి 2 (Bahubali 2)సినిమా 1810 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పుష్ప 2(Pushpa 2) 1871 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా దంగల్ సినిమా రికార్డు ను బ్రేక్ చేయలేకపోవడంతో ఆ రికార్డును బ్రేక్ చేసే సత్తా తెలుగు సినిమాలకు లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో రాజమౌళి ఆ రికార్డును బ్రేక్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలకు చెక్ పెడుతూ ‘త్రిబుల్ ఆర్’ కేవలం 1300 కోట్ల వరకే కలెక్షన్స్ ని రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన దంగల్ సినిమా రికార్డును దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ సినిమా బ్రేక్ చేయలేకపోతుంది.
అలాంటిది మన ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉందని చెప్పడం సరైన విషయం కాదు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో దంగల్ సినిమా రికార్డు బ్రేక్ అవుతుందని చాలామంది చెబుతున్నప్పటికి ఆ సినిమా రావడానికి మరో మూడు సంవత్సరాలు సమయమైతే ఉంది.
కాబట్టి ఈలోపు ఏ సినిమా కూడా దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆ సినిమా రికార్డును బ్రేక్ చేయకుండా దాదాపు పది సంవత్సరాల వరకు అలాగే ఉంది అంటే ఆ సినిమా పొటెన్షియల్టి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… అలాంటి దంగల్ సినిమాను చేసిన అమీర్ ఖాన్ నిజంగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం ఆయన సినిమా అంటూ చేస్తే దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసే సినిమాలు మాత్రమే చేస్తానని పట్టుబట్టుకూర్చున్నాడు. అందువల్లే చాలా కథలను వింటున్నాడు తప్ప అతనికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏమి దొరకడం లేదని దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకోకుండా ఉంటున్నాడు…