https://oktelugu.com/

Anil Ravipudi and Chiranjeevi : వచ్చే సంక్రాంతి కి చిరంజీవి విన్నర్ గా నిలుస్తాడా..? అనిల్ రావిపూడి ఏం చేయబోతున్నాడు..?

Anil Ravipudi and Chiranjeevi : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరోల్లో తెలుగు సినిమా హీరోలు మొదటి వరుసలో ఉన్నారు. ఇక సీనియర్ హీరోలు అందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో చిరంజీవి లాంటి హీరో సైతం ఇప్పుడు వరుసగా సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు...

Written By: , Updated On : April 3, 2025 / 08:17 AM IST
Anil Ravipudi , Chiranjeevi

Anil Ravipudi , Chiranjeevi

Follow us on

Anil Ravipudi and Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేరులలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు ఒకటి… ఆయన చేసిన సినిమాలు ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాయనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉండే విధంగా చూసుకుంటూ వస్తున్నారు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతూ భారీ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర (Vishvambhara) సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఉగాది సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ముహూర్తాన్ని అయితే జరుపుకున్నారు. తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మూవీ టీమ్ మొత్తాన్ని పరిచయం చేస్తూ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి ఒక వీడియోను కూడా చేశారు.

Also Read : అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా నటించనున్న టాలీవుడ్ స్టార్ హీరో… మామూలుగా లేదుగా..?

అయితే ఈ వీడియో సైకిల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను బరిలోకి దింపారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా చిరంజీవికి ఇంతకుముందు ఉన్న స్టార్ డమ్ కంటే మరింత గొప్ప స్టార్ డమ్ ను సంపాదించి పెడుతుందా? లేదా అనే అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటితో మంచి విజయాలను సాధించాడు. కాబట్టి ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే త్రిబుల్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నవాడు అవుతాడు. మరి తను అనుకున్నట్టుగానే చిరంజీవితో చేయబోయే సినిమాని చాలా గొప్ప విజయం గా మారుస్తాడా?

లేదా అనేది తెలియాలంటే మాత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమాతో చిరంజీవికి భారీ సక్సెస్ ని అందిస్తే అనిల్ రావిపూడికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుందనే చెప్పాలి. మరి ఆయన కూడా పాన్ ఇండియాలో సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి ఈ సినిమా కూడా చాలావరకు హెల్ప్ అవుతుంది…

Also Read : 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమాతో రానున్న అనిల్ రావిపూడి…ఆ పండుగ కూడా నాదే అంటున్న డైరెక్టర్…