Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఆయన సాధించిన విజయాలే ఆయన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. మొదటి సినిమా నుంచి చివరగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాయి… అందుకే రాజమౌళి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అభిమానం ఉండటమే కాకుండా ఆయన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు సైతం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుసగా 12 సినిమాలను చేసి 12 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందుకోసమే ఆయన సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం బాహుబలి(Bahubal), త్రిబుల్ ఆర్ (RRR) లాంటి రెండు సినిమాలతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో తనను తాను స్టార్ డైరెక్టర్ గా నిలుపుకుంటాడా లేదా అనే విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…
ఈ సినిమాలతో భారీ విజయాన్ని సాధించి ప్రపంచంలో ఉన్న దిగ్గజ దర్శకులందరికి పోటీగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన జేమ్స్ కామెరూన్ సైతం గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన కోసమే డిజైన్ చేసిన ఒక పాత్రలో తను నటించి సినిమా మీద భారీ హోప్స్ పెంచుతారనే ఉద్దేశ్యంతో రాజమౌళి భావించారట. తను అనుకున్నట్టుగానే తొందర్లోనే జేమ్స్ కామెరూన్ ను కలిసి అతనికి కథ చెప్పి ఆయన చేత ఆ క్యారెక్టర్ చేయించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి తను అనుకున్నట్టుగానే జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో నటిస్తాడా? ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి తనకు సహకరిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఒకవేళ జేమ్స్ కామెరూన్ కనక ఈ సినిమాలో నటించినట్లయితే మాత్రం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది…
Also Read : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న సూర్య క్లారిటీ ఇచ్చిన నటుడు…