Salaar 2 Prabhas grandfather role entry: ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గరలో ఉన్న తెలుగు హీరో ప్రభాస్… ఆయన చేసిన ప్రతి పాన్ ఇండియా సినిమా కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే తన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి. ఇకమీదట సైతం ఆయన అదే పంథా లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా ఈ సంవత్సరంలో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.ఈ సినిమా షూటింగ్ చేరవేగంగా జరుపుకుంటుంది… ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.
ఇందులో ప్రభాస్ ను ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూశాం. ఇక మాస్ ఎలివేషన్స్ ను సైతం భారీ రేంజ్ లో ఇచ్చిన ప్రశాంత్ నీల్… సలార్ 2 ను సైతం వీలైనంత తొందర్లోనే స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలనే ప్రయత్నంలో తను ఉన్నాడట.
Also Read: ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను తక్కువ అంచనా వేసిన దర్శకుడు…
దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సలార్ 2 సినిమాలో ప్రభాస్ వాళ్ల తాత క్యారెక్టర్ కూడా చాలా కీలకంగా మారబోతుందట. అయితే ఈ క్యారెక్టర్ ను సైతం ప్రభాస్ పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ తాత యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏం చేశాడు ఎలా తన కాన్సర్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అనేది తెలిసేలా ఆయనకు సంబంధించిన ఒక బ్యాక్ స్టోర్ ఉంటుందట.
అది దాదాపు 15 నిమిషాల పాటు వస్తుందట. ఇక అందులో సైతం ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే ప్రభాస్ అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించినట్లయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవల్లో నిలుస్తుందనే చెప్పాలి…
