Director underestimated NTR Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు…కారణమేంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఉన్నవాళ్ళకు మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అలాంటి సమయంలో మనం సక్సెస్ లో ఉన్నామని గర్వం చూపించకూడదు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కామన్… వీటిని దృష్టిలో పెట్టుకుంటే అందరికి మంచిది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఇద్దరు హీరోలు కలిసి పనిచేయాలని అనుకున్నారు.
కానీ ఆ దర్శకుడు మాత్రం వీళ్లతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఇమేజ్ కూడా భారీ లెవెల్లో పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా ఇమేజ్ ను పెంచిన వీళ్ళతో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలని చూస్తుంటే ఇప్పుడు మన హీరోలు వాళ్ళకి డేట్స్ ఇవ్వడం లేదట. ఇంతకీ ఆదర్శకుడు ఎవరు అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ కావడం విశేషం…
Also Read: ఎక్స్ క్లూజివ్: టాలీవుడ్ హీరోతో ‘ధురంధర్’ దర్శకుడి తదుపరి చిత్రం
ఒకప్పుడు శంకర్ చేసిన ప్రతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను సాధించాడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆయన చేసే సినిమాల విషయంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండడం లేదు. ప్రేక్షకులు సైతం అతని సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు…
ఇక ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో శంకర్ తో ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు చేసే అవకాశం ఉందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. గత సంవత్సరం రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో శంకర్ ఇకమీదట సినిమాలను చేయడం మానేస్తే బెటర్ అంటు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు…
