Homeఎంటర్టైన్మెంట్Varanasi movie set video viral: 'బాహుబలి' ని మించిన 'వారణాసి' మూవీ సెట్లు.. సంచలనం...

Varanasi movie set video viral: ‘బాహుబలి’ ని మించిన ‘వారణాసి’ మూవీ సెట్లు.. సంచలనం రేపుతున్న వీడియో..

Varanasi movie set video viral: మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో గ్రాండియర్ అనే పదాన్ని తీసుకొస్తే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి(SS Rajamouli). ఆయన కారణంగానే నేడు మన టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది. గ్రాండియర్ సినిమాలను హాలీవుడ్ తరహాలో తెరకెక్కించగలుగుతోంది. తన ప్రతీ సినిమాతో కొత్త బెంచ్ మార్కులను క్రియేట్ చేయడం రాజమౌళి కి కొత్తేమి కాదు. ఇంతకు మించి ఏ సినిమా తియ్యగలరు అని అనుకున్న ప్రతీ సారీ, రాజమౌళి సరికొత్త ఆలోచనలతో మన ముందుకొస్తు సర్ప్రైజ్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో ‘వారణాసి'(Varanasi Movie) అనే చిత్రం చేస్తున్నాడు. రామాయణం తో లింక్ చేస్తూ, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎలాంటి మెయిన్ కంటెంట్ బయటకు రాలేదు.

అయినప్పటికీ కూడా ఈ సినిమా పై ఇంత క్రేజ్ ఉందంటే , ఇక రాబోయే రోజుల్లో అప్డేట్స్ వచ్చే కొద్దీ ఈ చిత్రం పై అంచనాలు ఏ రేంజ్ లో పెరగబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన సెట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వారణాసి లో ప్రతీ రోజు షూటింగ్ చేయలేరు కాబట్టి, ‘వారణాసి’ ని మక్కీకి మక్కి దింపుతూ సెట్స్ ఏర్పాటు చేశారు. అవి చూసేందుకు ఎంతో రిచ్ గా ఉన్నాయి. ఇలా కృతిమంగా పవిత్రమైన ఈ సిటీ ని నిర్మించడానికి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయ్యిందట. ప్రస్తుతం ఈ సెట్స్ లో షూటింగ్ జరగడం లేదు. ఆరంభం లోనే 20 రోజుల పాటు మహేష్ బాబు మరియు ఇతర ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు రాజమౌళి.

Also Read: ‘సలార్ 2’ లో ప్రభాస్ తాత ఎంట్రీ ఉంటుంది : ప్రశాంత్ నీల్…

ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఒక స్టూడియో లో ఏర్పాటు చేసిన అడవి సెట్టింగ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ నెల లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ కి సంబంధించిన VFX వర్క్ నడుస్తోంది అట. ఏప్రిల్ 7 న గ్లోబల్ వైడ్ గా అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపుగా 149 దేశాల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చైనా , రష్యా, జపాన్ , కొరియన్ వంటి భాషల్లో కూడా ఈ సినిమా అనువాదం కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Varanasi (@varanasimovie)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper