Sai Pallavi: పొలంలో కూలీ పనులు చేస్తున్న క్రేజీ స్టార్ హీరోయిన్

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే… సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. తాజాగా సాయి పల్లవి ఉగాది పర్వదినాన్నిపురష్కరించుకుని.. ఆమె రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు చేసింది. ఈ ఫోటోలను సాయిపల్లవి తన ఇన్‌ స్టా లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో సాయి పల్లవి మరింత […]

Written By: Shiva, Updated On : April 3, 2022 4:33 pm
Follow us on

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే… సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. తాజాగా సాయి పల్లవి ఉగాది పర్వదినాన్నిపురష్కరించుకుని.. ఆమె రైతుగా మారింది. కూలీలతో కలిసి పనులు చేసింది.

Sai Pallavi

ఈ ఫోటోలను సాయిపల్లవి తన ఇన్‌ స్టా లో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో సాయి పల్లవి మరింత ముద్దుగా కనిపించడంతో.. విపరీతంగా వైరల్‌‌గా మారాయి. సాయిపల్లవి నీలా ఎవ్వరూ ఉండలేరంటూ నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రశంసించారు. అసలు హీరోయిన్లు అందరూ తమ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం ఇలాంటి ఫొటోస్ ని ఎక్కువగా షేర్ చేస్తోంది.

Also Read: Kalyan Ram Bimbisara: ‘బింబిసార’ రాక ఓకే.. ఇంతకీ కేక పెట్టిస్తాడా ?

మొత్తమ్మీద ఈ ఫొటోలతో సాయి పల్లవి తన భావజాలం ఏమిటో, తన క్యారెక్టర్ ఏమిటో బాగా నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. వెండితెర పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా సాయి పల్లవి పద్దతికి మారుపేరు అని మరోసారి ఘనంగా నిరూపించుకుంది. నిజానికి సాయి పల్లవి సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

అంత సహజంగా ఉంటుంది ఆమె. సినిమాకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవనశైలిని పాటిస్తూ ఉండటం.. బహుశా ఈ జనరేషన్ లో ఒక్క సాయి పల్లవికే సాధ్యం అయింది అనుకుంటా. ఇక సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Sai Pallavi

ఇక 2021 లో సాయి పల్లవి చేసిన రెండు సినిమాలు ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ మంచి విజయాలు సాధించాయి. ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ 2022లో సాయి పల్లవి ఏ సినిమాలు చేస్తోందో క్లారిటీ లేదు. పైగా ఇప్పటివరకు ‘సాయి పల్లవి’ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు.

Tags