https://oktelugu.com/

Kalyan Ram Bimbisara: ‘బింబిసార’ రాక ఓకే.. ఇంతకీ కేక పెట్టిస్తాడా ?

Kalyan Ram Bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసార’ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కల్యాణ్‌రామ్‌కు జోడిగా కేథరిన్, సంయుక్త మేనన్‌లు నటించారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతోంది. పైగా క‌ల్యాణ్ రామ్ పూర్తి యాక్షన్ మోడ్ లో […]

Written By: , Updated On : April 3, 2022 / 04:26 PM IST
Follow us on

Kalyan Ram Bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసార’ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కల్యాణ్‌రామ్‌కు జోడిగా కేథరిన్, సంయుక్త మేనన్‌లు నటించారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతోంది.

Kalyan Ram Bimbisara

Kalyan Ram Bimbisara

పైగా క‌ల్యాణ్ రామ్ పూర్తి యాక్షన్ మోడ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాకపోతే, క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసే విన్యాసాలు ఎవరికీ కావాలి ?. నందమూరి అభిమానులు మాత్రం ఆ విన్యాసాలను ఎంతవరకు అని చూస్తారు. ఎలాగూ బాలయ్య, ఎన్టీఆర్ అలాంటి విన్యాసాలే కదా చేసేది. మళ్ళీ కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు ఆ విన్యాసాల మీదే పడితే ఏమి ఉపయోగం ?

Also Read: Actor Hema: డ్రగ్స్ కేసులో తన పేరు ఆ మీడియా వెల్లడించడంపై నటి హేమ నిప్పులు

అయినా మ‌గ‌ధీర‌, బాహుబ‌లి సినిమాల కన్నా గొప్పగా ఏమి చూపిస్తారు ఈ సినిమాలో. దీనికి తోడు కల్యాణ్ రామ్ క్యారెక్ట‌ర్‌లో నెగిటీవ్ ఛాయ‌లు ఉంటాయట. సాఫ్ట్ పాత్రల్నే కళ్యాణ్ రామ్ కరెక్ట్ గా పోషించలేడు అని టాక్ ఉంది. అలాంటిది ఇక నెగిటివ్ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తాడు ? పైగా ఈ బింబిసార‌ సినిమా పూర్తిగా క‌త్తి – డాలు టైపు క‌థతో సాగుతుంది.

అలాగే క‌థ‌లో రెండు కోణాలున్నాయ‌ట. అయినా కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా కనిపించడమే కష్టం, ఇక నటించి మెప్పించడం ఎలా ? అన్నట్టు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. పాన్ ఐడియా లెవల్ లో స్కోప్ ఉందట. స్కోప్ ఉన్నా మార్కెట్ ఉండక్కర్లేదా ? మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. ఏది ఏమైనా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ సినిమాల సెలెక్షన్ మొదటినుండి విభిన్నంగానే సాగుతుంది.

Kalyan Ram Bimbisara

Kalyan Ram Bimbisara

విజ‌య‌మో, వైఫ‌ల్య‌మో – ఏదీ ప‌ట్టించుకోకుండా ప్ర‌యోగాల చేస్తూనే వెళ్తుంటాడు క‌ల్యాణ్ రామ్‌. కొత్త క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం అంటే త‌న‌కు భ‌లే స‌ర‌దా. బింబిసార‌ కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. కానీ రిజల్ట్ కూడా రెగ్యులర్ గానే వస్తే.. కళ్యాణ్ రామ్ కి భారీ నష్టాలు ఉంటాయి. అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. మరి చివరకు బింబిసార‌ ఏం చేస్తాడో చూడాలి.

Also Read:CP Series On Rave Party: రేవ్ పార్టీ ఘ‌ట‌న‌పై సీపీ సీరియ‌స్‌.. సీఐపై వేటు, ఏసీపీకి మెమో.. బ్యాన్ చేయాల‌న్న మాజీ ఎంపీ..

Tags