Harihara Veeramallu OTT Release : ఈ ఏడాది అభిమానులను, ప్రేక్షకులను భారీగా నిరాశపర్చిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Harihara Veeramallu). ఎన్నికల్లో దేశం మొత్తం రీ సౌండ్ వచ్చే రేంజ్ విజయాన్ని అందుకొని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి వచ్చే ఈ సినిమాని ఒక పండుగ లాగా జరుపుకోవాలని అభిమానులు భారీ ప్లానింగ్స్ చేసుకున్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ 600 నుండి 700 రేంజ్ లో పెట్టినప్పటికీ కూడా అభిమానులు ఎగబడి మరీ ఈ చిత్రానికి వెళ్లారు. కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఫ్యాన్స్ ఈ చిత్రం మీద చూపించిన ప్రేమ ఎలాంటిదో. అంత ప్రేమతో వెళ్లిన సినిమాకు డైరెక్టర్ అత్యంత నాసిరకమైన క్వాలిటీ సినిమా ఇస్తే ఎంత బాధగా ఉంటుందో మాటల్లో వర్ణించలేము.
Ela ok chesav ra ee shot @amjothikrishna pic.twitter.com/veiKMM0TCP
— వేటగాడు (@rao_4005) August 20, 2025
ఈ సినిమా సెకండ్ హాఫ్ అభిమానులకు ఒక పీడకల లాంటిది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు కూడా AI ని ఉపయోగించి, అద్భుతమైన గ్రాఫిక్స్ తో వీడియోలు చేస్తున్న రోజులివి. అలాంటి రోజుల్లో ఇలాంటి VFX సన్నివేశాలు చూసి అభిమానులకు నోటి నుండి మాట రాలేదు. త్రివిక్రమ్ ఒక ఫంక్షన్ లో చెప్పినట్టు ‘జేబులో చేతులు పెట్టుకొని ఏటో వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు’ అనే డైలాగ్ అభిమానులకు సరిగ్గా సూట్ అవుతుంది. ప్రీమియర్ షోస్ చూసిన అభిమానుల పరిస్థితి అదే పాపం. పోనిలే ఈ సినిమా గోల వదిలింది, ఇక సంతోషంగా ఉండొచ్చు, ఓజీ మేనియా లో మునిగి తేలుదాం అని అభిమానులు మూవ్ ఆన్ అయిపోయారు. కానీ దరిద్రం అంత తేలికగా వదలదు కదా?, నిన్ననే ఈ కళా ఖండం అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ప్రత్యక్షమైంది.
— HarshaVardhan (@HarshaVardhan3_) August 20, 2025
ఈ సినిమా అమెజాన్ లోకి వచ్చినప్పటి నుండి నెటిజెన్స్ ఈ చిత్రం లోని సన్నివేశాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో అందరికీ చూపించారు. డైరెక్టర్ క్రిష్ తీసిన సన్నివేశాల వరకు ఎలాంటి వంకలు పెట్టడం లేదు కానీ, జ్యోతి కృష్ణ తీసిన సన్నివేశాలను మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా పర్ఫెక్ట్ గా తియ్యలేదు. అభిమానులకు కూడా వీటిని చూసిన తర్వాత సినిమాలో ఇన్ని బొక్కలు ఉన్నాయా అని వాపోతున్నారు. సన్నిహితులు అని నమ్మి ఇలాంటోళ్లకు సినిమా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి తండ్రి కొడుకులు వెన్నుపోటు పొడిచారు అంటూ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్మాత AM రత్నం, జ్యోతి కృష్ణ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా సన్నివేశాలపై జరుగుతున్నా ఫన్నీ ట్రోల్స్ కొన్ని మీ కోసం అందిస్తున్నాము చూడండి.
The Cinematic Masterpiece ah First shot #JyothiNolan#HHVMonPrime
— Mangapathi (@mahendra4NTR) August 20, 2025
Day1 ki oka print.. Day3 numdi emko print.. Ott ki maro print… Em manishivi ra ayya @amjothikrishna https://t.co/Az8yjGcurw
— తెలుగు రాష్ట్రాల దేవుడు వస్తున్నాడు (@AandhiFanIkkada) August 20, 2025