Homeఎంటర్టైన్మెంట్Tollywood: ప్రముఖ హీరో శింబు సినిమా రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడా...

Tollywood: ప్రముఖ హీరో శింబు సినిమా రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడా…

Tollywood: తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఈ యంగ్ హీరో. గత ఏడాది విడుదలైన “ఈశ్వరన్” సినిమాతో మంచి విజయం సాధించాడు ఈ హీరో. ఈ ఏడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో విడుదలైన “మానాడు” చిత్రం తమిళనాట సెన్సేషన్ క్రియేట్ వస్తున్న విషయం తెలిసిందే.

Tollywood
sai dharam tej may act in tamil hero simbu maanaadu movie remake

రిలీజ్ ముందు ఎన్నో సందేహాలు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ ఏడాది శింబు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను వినోదాత్మకంగా ప్రెజెంట్ చేసిన తీరుకు అందరినీ ఫిదా చేసింది ఈ చిత్రం. శింబు, ఎస్‌.జె.సూర్య తమ పాత్రలో అభిమానులతో అదుర్స్ పెంచుకునేలా నటించారు. అయితే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలనుకున్నారు. “ది లూప్” అనే టైటిల్ పెట్టి తెలుగు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

Also Read: విరాళాలు.. సినిమా వాళ్లే ఇవ్వాలా ? రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వరు ?

ఈ సినిమాకి సంబంధించి శింబు వచ్చి ఇక్కడ సినిమాను ప్రమోట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్ లో విడుదలైన షెడ్యూల్ ప్రకారం తెలుగులో విడుదల అవ్వలేదు. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో అసలు పోటీ లేని టైంలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ అనుకున్నంత ఉండేదేమో కానీ ఉన్నట్లుండి రిలీజ్ ఆపేశారు. ప్రస్తుతం శింబుకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, అలానే ఈ సినిమాని మంచి రేటుకు రీమేక్ హక్కులు అమ్ముకోవడం మంచిదని ఆపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ లో సాయిధరమ్ తేజ్ హీరో తెరకెక్కించాలని ఓ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి‌.

Also Read: త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ ఇవ్వనున్న “పుష్ప” యూనిట్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version