https://oktelugu.com/

Pushpa Movie: త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ ఇవ్వనున్న “పుష్ప” యూనిట్…

Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ ఏడాది డిసెంబర్‌ 17న పుష్ప ది రైజ్‌ పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటివలే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షక అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇదిలా ఉండగా మరో పక్క మేకర్స్ ఎప్పటికపుడు సాలిడ్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 05:05 PM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ ఏడాది డిసెంబర్‌ 17న పుష్ప ది రైజ్‌ పేరుతో ఫస్ట్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటివలే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షక అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇదిలా ఉండగా మరో పక్క మేకర్స్ ఎప్పటికపుడు సాలిడ్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రత్యేకమైన పాటలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నారు.  ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. “మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని ఇటీవల రిలీజ్ చేశారు.

    Pushpa Movie

    Also Read: ప్యారిస్​లో రష్మిక హాలిడే ట్రిప్​.. అక్కడ ఏం చేస్తోందో తెలుసా?

    ఈ పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో సెక్సీ లుక్ తో అదరగొట్టేసింది. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ని కూడా త్వరలోనే  రివీల్ చేయనున్నారట మూవీ యూనిట్. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ పాటలు, ట్రైలర్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. బన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

    Also Read: పుష్ప సినిమా రన్​టైమ్​పై ఇంట్రెస్టింగ్ అప్​డేట్​