Sinful Birth: హిందూ సంప్రదాయానికి ఇతిహాసాలు అద్దం లాంటివి. వాటిలోని సారాంశాన్ని బట్టి మనుషులు తమ నడవడిక మార్చుకుంటారు. వేదాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలు మన మానవ నాగరికతను ప్రపంచానికి చాటాయి. రామాయణం పురాతనమైనదిగా గుర్తించబడింది. కృతా యుగంలో రామాయణం, త్రేతా యుగంలో మహాభారతం, ద్వాపర యుగంలో భాగవతం వచ్చాయని తెలిసిందే.
హైందవ ధర్మం ప్రకారం తప్పులు చేసిన వారికి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయనేది సారాంశం. అయితే ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎవరికి తెలియదు. కొందరికి తప్పుగా తోచింది మరికొందరికి ఒప్పుగాను తోస్తుంది. తప్పు అనేది ఏ స్థాయిలో ఉందో ఎవరికి కూడా అంతుబట్టదు. కానీ తప్పొప్పులపై పాండవ రాజు ధర్మరాజుకు కూడా పలు సందేహాలు వచ్చాయి. దీంతో ఆయన తాత భీష్మాచారి వద్దకు వెళ్లి తన సందేహాలను నివృత్తి చేసుకుంటాడు.
పాపాలతోనే మన జన్మలు సంప్రాప్తిస్తాయని విశ్వాసం ఉంది. దీంతోనే మన పుట్టుకలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఏ తప్పు చేస్తే వచ్చే జన్మలో ఏ జంతువుగా పుడతారో కూడా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ మనిషి చనిపోయిన తరువాత మరో జన్మ ఉంటుందనేదానిపై ఎలాంటి స్పష్టత మాత్రం లేకపోవడం గమనార్హం. అన్ని మన ఊహలకు అనుగుణంగా మనం సృష్టించుకున్నవే కావడం విశేషం.
Also Read: Horoscope 2022: వచ్చే ఏడాది మేష రాశి వారికి ఎలా ఉండబోతోందంటే!
మన కర్మ ఫలితంగానే మనకు పునర్జన్మలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి చెడు పనికి చెడు ప్రతిఫలమే దక్కుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాప పుణ్యాలపై పలు రకాల కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు మాత్రం పునర్జన్మలపై ఏ విధమైన కథలు నమ్మకుండా మంచి పనులు చేసి మంచివారుగా మనగలగడమే ప్రధాన కర్తవ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Father: చాణక్య నీతి: పిల్లల విజయంలో తండ్రిది కీలక పాత్రేనా?