Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన మెగాస్టార్ చిరంజీవి. ఆయన మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇటీవలె ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి తేజ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనికి తోడు ఈ రోజు తేజ్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.
విజయ దశమి రోజున సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ అనే చెప్పాలి. గత నెల వినాయక చవితి రోజు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయి… 35 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. దీంతో మెగా ఇంట్లో విజయం దశమి పండుగ సంతోషం మరింత రెట్టింపయ్యింది.
Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the accident,having had a miraculous escape,making us all happy & grateful!Nothing short of a Rebirth for him!
Happy Birthday Dear Teju from Atha & PedaMama!Stay Blessed! pic.twitter.com/pvIpsJalh1
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2021
అయితే తేజ్‌కు యాక్సిడెంట్ అయిన సమయంలో సోషల్‌మీడియా, పలు టీవీ చానెల్స్‌లో రకరకాల వార్తలు వినిపించాయి. వీటిపై స్పందించిన మెగా ఫ్యామిలీ అవన్నీ అవాస్తవమని తెలిపింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ వార్తతో తేజ్ అభిమానులు ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు , నిండు నూరేల్లు ఆరోగ్యంతో ఉండాలని సోషల్ మీడియా లో పోస్ట్ లు చేస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sai dharam tej discharged from hosptal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com