https://oktelugu.com/

Karthikeya: స్టూడెంట్స్​తో సెల్ఫీలు దిగుతూ.. రాజా విక్రమార్క సందడి!

Karthikeya: ఆర్​ఎక్స్ 100 సినిమాతో హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ.  కాగా, కార్తికేయ హీరోగా తాన్య రవించ్రంద్రన్​ హీరోయిన్​గా నటిస్తోన్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు శ్రీ సిరిపల్లి.  తాజాగా, వీవీఐటీలో ఈ చిత్రయూనిట్​ సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్‌ సందర్శించింది. ఈ క్రమంలోనే స్టూడెంట్స్​తో ముచ్చటించింది. ఈ సందర్భంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 11, 2021 / 01:42 PM IST
    Follow us on

    Karthikeya: ఆర్​ఎక్స్ 100 సినిమాతో హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ.  కాగా, కార్తికేయ హీరోగా తాన్య రవించ్రంద్రన్​ హీరోయిన్​గా నటిస్తోన్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు శ్రీ సిరిపల్లి.  తాజాగా, వీవీఐటీలో ఈ చిత్రయూనిట్​ సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్‌ సందర్శించింది. ఈ క్రమంలోనే స్టూడెంట్స్​తో ముచ్చటించింది.

    ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. అద్భుతమైన సాంకేతిక హంగులతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. దర్శకుడు శ్రీ సరిపల్లికి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. ఎంతో నైపుణ్యంతో సినిమాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు జనాల్లో మంచి టాక్​ నడుస్తోంది. తన తొలి సినిమా నుంచి ప్రచారంలో భాగంగా వీవీఐటీని సందర్శించడం మాములైందని అన్నారు. కాగా, మరోవైపు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ.. మంచి కథతో ప్రేక్షకులనకు పరిచయమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నవంబరు 12న ఈ సినిమా విడుదల కానుందని అన్నారు. రాజా విక్రమార్క సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ హీరో కార్తికేయ సందడి చేశారు.