Bodygards Black Glass: రాజకీయనాయకులు, ప్రముఖులు బయటికి వెళ్లేటప్పడు భద్రతతో కలిగి ఉంటారు. ప్రజాప్రతినిధులైతే వారి వెంట పోలీసులతో పాటు బాడీగార్డ్స్ ఉంటారు. అయితే కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా స్పెషల్ గా బాడీగార్డ్స్ ను నియమించుకుంటారు.
వీరు ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా వారి వెంటే ఉంటారు. అంతేకాకుండా అపరిచిత వ్యక్తులను ఎక్కువగా వీరితో కలవనీయరు. అయితే వీరు ఎప్పుడూ ఒకే మాదిరి డ్రెస్ కోడ్ మెయింటేన్ చేయడంతో పాటు ఎక్కువగా కళ్లద్దాలు పెట్టుకొని ఉంటారు. అందులోనూ నల్ల కళ్లద్దాలను మాత్రమే ధరిస్తారు.
అయితే నల్ల కళ్లద్దాలు మాత్రమే వాడడానికి కారణం ఏంటి..? అలా నల్ల కళ్ల ద్దాలు ధరించి వారు ఏం చేస్తారు..?
రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటారు. ప్రజల్లో రకరకాల మనుషులు ఉంటారు. మంచివాళ్లు ఉంటారు.. చెడ్డవాళ్లు ఉంటారు. అయితే ప్రముఖులను కలువాలనుకువారిని కొందరు ముందుగా చెక్ చేసి ఆ తరువాత అనుమతి ఇస్తారు. అయితే కొందరు మాత్రం నేరుగా కలిసేందుకు ట్రై చేస్తారు. అలాంటి వారిని పక్కకి నెట్టేస్తారు. ముందుగా వారి వద్ద నుంచి పర్మిషన్ తీసుకున్న తరువాతే వారు కలువాలనుకునేవారికి కలిసే అవకాశం ఉంటుంది.
ఇక సభలు, సమావేశాల్లో బాడీ గార్డ్స్ ఎక్కువగా నల్ల కళ్లద్దాలు ధరించి కనిపిస్తారు. అంతేకాకుండా వారు అక్కడున్నవారి ప్రసంగాన్ని పట్టించుకోకుండా అటూ ఇటూ చూస్తారు. అయితే సాధారణంగా మనం ఎవరినైనా తదేకంగా చూస్తే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ సభల్లో ఇలా చేస్తే అక్కడికి వెళ్లిని వారికి ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల బాడీ గార్డ్స్ నల్ల కల్లద్దాలు పెట్టుకొని అందులో నుంచి జనం కదలికలను గమనిస్తూ ఉంటారు. ఇక వీరు ఎటు చూస్తూన్నారో..? ఎవరిని తదేకంగా చూస్తున్నారో..? ఎదుటివారికి అర్థం కాదు.
ఈ క్రమంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా.. సభలు, సమావేశాల్లో సమస్య తెచ్చేందుకు యత్నించినా ముందుగానే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. మరీ ఆ ప్రముఖుల వద్దకు చేరుకుంటే స్వయంగా వారే రంగంలోకి దిగి ఎదుటివారిని వారిస్తారు. ఇలా బాడీ గార్డ్స్ నిత్యం అప్రమత్తంగా ఉంటూ వారి నాయకులను కాపాడుతూ ఉంటారు. అయితే కొంత మంది నల్ల కళ్లద్దాలు కేవలం స్టైల్ కోసమే పెట్టుకుంటారు అనుకుంటారు. కానీ వారు లోపల చేసేది ఇదన్నమాట.
Also Read: Tollywood Actors : కోట్ల రూపాయలు ఇచ్చి భార్యలను వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా..?