KCR: హుజూరాబాద్ ఎన్నికలు ముగిశాయి. ఇందులో బీజేపీకి అనుకూలంగా ఫలితం వచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు మంచి జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపుతో రాష్ట్ర వ్యాప్తంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదన్న మాట వాస్తవం. దానిని భర్తీ చేసుకోవడానికి బీజేపీ ఇప్పుడు వ్యూహం రచిస్తోంది. దాని కోసం కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తరువాత క్లారిటీ..
ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో ఆరుగురు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోకున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ సారి తమకు కేసీఆర్(KCR) స్థానం కల్పిస్తారని ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో మరో 12 మంది ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఆ స్థానాల్లో కూడా త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే చాలా మంది ఆశావహులు ఉండటం, కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఉండటంతో అందరికీ అవకాశం దక్కకపోవచ్చు. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తికి గురి అయ్యే అవకాశం ఉండొచ్చు. అందులో బలమైన నాయకులను బీజేపీలోకి తీసుకునేందుకు ప్లాన్ జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకులు ఉంటేనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం బీజేపీకి కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు స్థానాలు పార్టీ బలం వల్ల కాకుండా ఆయా అభ్యర్థుల వ్యక్తిగత బలం వల్లనే గెలిచారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. అలాంటి అభ్యర్థులు ప్రతీ నియోజకవర్గంలో బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం. సొంతంగా ఆ అభ్యర్థికి ప్రజల్లో అభిమానం ఉండటంతో పాటు, కొంత బీజేపీ బలం కలిస్తే అక్కడ సులభంగా విజయం సాధించవచ్చు అనేది ఆ పార్టీ నాయకుల ఆలోచన. అయితే సీఎం కేసీఆర్ నిర్ణయం తరువాత కచ్చితంగా బీజేపీలోకి వలసలు ఉండొచ్చు..
టీఆర్ఎస్‌కు పెద్ద టాస్క్..
ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తరువాత టీఆర్ఎస్ ముందు చాలా పెద్ద టాస్క్ ఉండనుంది. అసంతృప్తులకు నచ్చజెప్పాల్సి ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల్లో, లేదా మిగితా పోస్టుల్లో అవకాశం ఇస్తామని బుజ్జగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే పార్టీ క్యాడర్ చేజారకుండా ఉంటుంది. లేకపోతే ఆ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే బలంపుంజుకుంటున్న బీజేపీకి.. టీఆర్ఎస్ చర్యలు మరింత బలం చేకూర్చే అవకాశం అవకాశం కనిపిస్తోంది. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూస్తే గానీ తెలియదు.
Also Read: కేసీఆర్ తిట్ల రాజకీయం పనిచేయలేదా?