Rupa Lakshmi
Rupa Lakshmi : దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిన బలగం ఒక సంచలనం. తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం తెరకెక్కింది. బలగం కమర్షియల్ గా భారీ సక్సెస్ కొట్టింది. కుటుంబాలను కదిలించిన ఈ చిత్రం చూసి అన్నదమ్ములు కలిసిపోయారు. తెలంగాణ పల్లెల్లో బహిరంగ ప్రదర్శనలు జరిగాయి. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణులో ఇంత టాలెంట్ ఉందా? అని పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. బలగం మూవీలో నటించిన ప్రతి నటుడు పాపులర్ అయ్యారు. కెరీర్లో సెటిల్ అయ్యారు. వారికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బలగం లో రూప లక్ష్మి ఓ కీలక రోల్ చేసింది.
హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తల్లి పాత్ర చేసింది రూపాలక్ష్మి. బలగంలో హీరో ప్రియదర్శికి ఆమె సొంత మేనత్తగా అలరించింది. సహజ నటనతో ఆకట్టుకుంది. రూపాలక్ష్మి పరిశ్రమకు చాలా కాలం అవుతుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆమె డెబ్యూ మూవీ. డీజే, మిడిల్ క్లాస్ అబ్బాయి, జయ జానకీ నాయకా, మహర్షి ఇలా అనేక హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. కానీ గుర్తింపు రాలేదు. బలగం సక్సెస్ తో ఎట్టకేలకు రూపాలక్ష్మి అనే ఒక ఆర్టిస్ట్ ఉందన్న విషయం జనాలకు తెలిసింది.
Also Read : బలగం’ బిడ్డ లచ్చవ్వ(రూపలక్ష్మి).. ఎవరు.? ఆమె కథేంటి?
కాగా రూపాలక్ష్మి తాజాగా ఇంస్టాగ్రామ్ లో డాన్స్ వీడియో పోస్ట్ చేసింది. టైట్ జీన్స్, టీ షర్ట్ ధరించిన రూప లక్ష్మి ఓ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ తో అలరించింది. రూపాలక్ష్మిలో వచ్చిన ఈ మార్పు చూసి ఆమె ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. రూపాలక్ష్మి కూడా చివరికి టాలెంట్ చూపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజుల్లో జనాల మదిలో ఉండాలన్నా, వార్తల్లో నిలవాలన్నా.. సోషల్ మీడియా ఏకైక మార్గం. ఏదో ఒకటి చేసి నెటిజెన్స్ మాట్లాడుకునేలా చేయాలి. అలాగే సోషల్ మీడియా చిన్న నటులకు ఆదాయ మార్గంగా మారింది.
ఈ విషయంలో సురేఖావాణి, ప్రగతి చాలా ముందున్నారు. ప్రగతి డాన్స్, జిమ్ వీడియోలు చేసి నెటిజెన్స్ నోళ్ళలో నానుతుంది. ఆమె ఫిట్నెస్ వీడియోలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోదు. వెయిటింగ్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ టైటిల్ కొట్టేస్తుంది. ఇక సురేఖావాణి హాట్, గ్లామరస్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజెన్స్ ఆకర్షిస్తుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సురేఖావాణి ఈ మార్గం ఎంచుకుంది. సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత సోషల్ మీడియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. ప్రగతి, సురేఖావాణిలను రూపాలక్ష్మి ఫాలో అవుతున్న భావన కలుగుతుంది.
Also Read : బలగం’పై ముసాలయన కొంరయ్య, కూతురు చెప్పిన నిజాలు